Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అల్లు అర్జున్ కలవడానికి 200 కిలోమీటర్లు నడక ప్రయాణం సాగించిన అభిమాని

Advertiesment
అల్లు అర్జున్ కలవడానికి 200 కిలోమీటర్లు నడక ప్రయాణం సాగించిన అభిమాని
, శనివారం, 3 అక్టోబరు 2020 (14:57 IST)
హీరోలంటే చాలామంది ప్యాన్స్‌కు పిచ్చి. తన అభిమాన నటుడు కోసం ఏం చేయడానికైనా సిద్దంగా ఉంటారు. తాజాగా టాలీవుడ్ స్పెషల్ స్టార్ అల్లు అర్జున్‌ను కలిసేందుకు మంచిర్యాల నుంచి హైదరాబాదుకు దాదాపు 200 కిలోమీటర్లు  నడుచుకుంటూ నాగేశ్వరరావు అనే ఓ అభిమాని వచ్చారు. అయితే ఈ విషయాన్ని తన టీం ద్వారా తెలుసుకున్న అల్లు అర్జున్ వెంటనే తనను ఆపి హైదరాబాదుకు తీసుకరమ్మని చెప్పారు.
 
వారం రోజులుగా అతని ఆచూకీ గురించి వెతకగా నిన్న సాయంత్రం అతనిని అల్లు అర్జున్‌కి కలిపించారు. అనంతరం అన్నీ అతనితో మాట్లాడారు. ఈ క్రమంలో తన అభిమాని నాగేశ్వరరావును కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బన్నీ, గంగోత్రి సినిమా నుంచి తనకు మీరు అంటే చాలా ఇష్టమని తెలిపారు.
 
అయితే మిమ్మల్ని కలుసుకునేందుకు రోజుకు 35 కిలోమీటర్ల నుండి 40 కిలోమీటర్లు నడిచానని చెప్పడంతో బన్నీ ఒక్కసారిగా కళ్లు చెమర్చాయి. అయితే ఇలా చేస్తే నీ ఆరోగ్యం ఏమవుతుందని బన్నీ అడగగా తాను మీకు పెద్ద ప్యాన్ అని మీ సినిమాలకు హాజరైనట్లుగా తెలిపారు. మిమ్మల్ని కలవడమే ధ్యేయంగా పెట్టుకొని మా ఊరి నుండి బయలుదేరానని నాగేశ్వరరావు తెలిపారు.
 
తన మీద ఉన్న అభిమానానికి చాలా ధన్యవాదాలు, కానీ ఇలా నడుచుకుంటూ రావడం బాధగా ఉందన్నారు. ఇలాంటివి మీ ప్యామిలీ కోసం చేస్తే నేను చాలా గర్వపడేవాడినని అల్లు అర్జున్ తెలిపారు. బన్నీ తన అభిమానికికి గుర్తుగా ఓమొక్కను ఇవ్వడమే కాకుండా అభిమానితో ఫోటో తీసుకున్నారు. దీంతో తన సొంత ఖర్చుతో అభిమానిని ఇంటికి పంపించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్ఆర్ఆర్ షూటింగ్‌కి ముహుర్తం ఫిక్స్