Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆర్ఆర్ఆర్ షూటింగ్‌కి ముహుర్తం ఫిక్స్

ఆర్ఆర్ఆర్ షూటింగ్‌కి ముహుర్తం ఫిక్స్
, శనివారం, 3 అక్టోబరు 2020 (14:49 IST)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. భారీ చిత్రాల నిర్మాత డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సంచలన చిత్రం అనుకున్న ప్రకారం షూటింగ్ జరగకపోవడం వలన రిలీజ్ డేట్ మారింది. సంక్రాంతికి రిలీజ్ చేద్దామనుకున్నారు. 
 
అయితే.. కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోవడంతో రిలీజ్ సంక్రాంతికి రావడం లేదు. ఎప్పుడు వస్తుందో ప్రస్తుతానికి క్లారిటీ లేదు. అయితే.. ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా..? షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందా..? రిలీజ్ ఎప్పుడు ఉంటుందా..? అని అటు ఎన్టీఆర్ అభిమానులు ఇటు చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
 
ఇదిలా ఉంటే.. ఇప్పుడిప్పుడే షూటింగ్స్ స్టార్ట్ అవుతుండడంతో ఆర్ఆర్ఆర్ షూటింగ్ కూడా స్టార్ట్ అవుతాది అనుకున్నారు. అయితే... భారీ తారాగణంతో చిత్రీకరించాల్సిన సీన్స్ ఉన్నాయి కాబట్టి షూటింగ్ స్టార్ట్ కావడానికి ఇంకా టైమ్ పట్టచ్చు అనుకున్నారు. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే... ఈ చిత్రం షూటింగ్ మొదలుపెట్టడానికి ముహుర్తం ఫిక్స్ చేసారని తెలిసింది. ఇంతకీ ఎప్పుడంటే... ఈ నెల 5 నుంచి హైదరాబాదులో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది.
 
షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ముందుగా ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి కీలక సన్నివేశాలు చిత్రీకరించాలి అనుకుంటున్నారట. ఈ సీన్స్ పూర్తైతే ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి వీడియో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారని సమాచారం. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్ 4, రేటింగ్ కోసం హౌస్‌లో డేటింగా? అర్థరాత్రి ఆ జంట ఆ పని చేసింది