Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉప్పెన హీరోయిన్‌కు బంపర్ ఆఫర్.. ఏంటది?

Webdunia
శనివారం, 10 అక్టోబరు 2020 (11:40 IST)
ఉప్పెన హీరోయిన్‌కు బంపర్ ఆఫర్ వచ్చింది. నేచురల్ స్టార్ నాని సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఆమె పేరు క్రితిశెట్టి. ఉప్పెన సినిమాతో తెలుగు తెరకి పరిచయం అవబోతున్న ఈ హీరోయిన్ కి అప్పుడే అవకాశాలు పోటెత్తుతున్నాయి. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కాబోతున్న ఉప్పెన సినిమా నుండి రెండు పాటలు మాత్రమే రిలీజ్ అయ్యాయి.
 
ఈ రెండు పాటల ద్వారానే ప్రేక్షకుల దృష్టిలో పడింది క్రితి శెట్టి. ఒక్కసారిగా ఆమెకి ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో కొత్త సినిమా ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా నాని హీరోగా నటించబోతున్న శ్యామ్ సింగరాయ్ సినిమాలో హీరోయిన్‌గా క్రితిశెట్టిని తీసుకుందామని చూస్తున్నారట.
 
ఈ మేరకు సంప్రదింపులు జరిగాయని సమాచారం. ప్రస్తుతానికి అధికారిక సమాచారం రానప్పటికీ క్రితిశెట్టి కన్ఫర్మ్ అయిపోయిందనే అంటున్నారు. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంక్రిత్యయాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి కూడా నటిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

తర్వాతి కథనం
Show comments