Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలుగు ప్రేక్షకులను లాక్‌డౌన్ చేసిన ''నీ కన్ను నీలి సముద్రం... నీ నవ్వు ముత్యాల హారం''

Advertiesment
తెలుగు ప్రేక్షకులను లాక్‌డౌన్ చేసిన ''నీ కన్ను నీలి సముద్రం... నీ నవ్వు ముత్యాల హారం''
, బుధవారం, 13 మే 2020 (19:57 IST)
కృతి శెట్టి - వైష్ణవ్ తేజ్
కరోనా వైరస్ కల్లోలంతో టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి విడుదల కావాల్సిన సినిమాలు జాప్యం అవుతున్నాయి. ఐతే సినిమా విడుదల కాకపోతే నా సత్తా ఏంటో చూడండి అంటోంది ఉప్పెన. అదెలాగా అనుకుంటున్నారా? ఇపుడు ఉప్పెన చిత్రంలోని 
''నీ కన్ను నీలి సముద్రం... నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం
నీ నవ్వు ముత్యాల హారం... నన్ను తీరానికి లాగేటి దారం దారం....''
 
ప్రతి తెలుగు హృదయాన్ని తాకేసిందని చెప్పేయవచ్చు. ఇప్పటికే ఈ పాట యూ ట్యూబ్‌లో 5 కోట్ల వ్యూస్‌తో దూసుకుపోతంది. ఇక టిక్‌టాక్‌లో అయితే ప్రతిరోజూ వేలమంది ఈ పాట ట్యూన్‌ను బాగా వాడేస్తున్నారు. ఈ చిత్రంలోని ఈ గీతాన్ని రాసిన శ్రీమణి, దానికి బాణీ కట్టిన దేవి శ్రీ ప్రసాద్, ఆలపించిన జావెద్ అలీ చక్కగా పాటను ప్రేక్షకులకు హత్తుకునేట్లు తీర్చిదిద్దారు. 
 
ఈ పాట ఇంతటి సంచలనం సృష్టిస్తుందంటే ఇక ఈ చిత్రం ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో. పంజా వైష్ణవ్ తేజ్, విజయ్ సేతుపతి, కృతి శెట్టి ప్రధాన తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
 


ఈ చిత్రానికి సంబంధించి వివరాలు...
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
గాయకుడు: జావేద్ అలీ
తెలుగు సాహిత్యం: శ్రీమణి
హిందీ సాహిత్యం: రకీబ్ ఆలం
హిందీ గానం & ఆలాప్: శ్రీకాంత్ చంద్ర
 
తారాగణం: పంజా వైష్ణవ్ తేజ్, విజయ్ సేతుపతి, కృతి శెట్టి
రచన & దర్శకత్వం: బుచ్చి బాబు సనా
సినిమాటోగ్రఫీ: షామ్‌దత్ సైనూదీన్
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్ డైరెక్టర్: మౌనికా రామకృష్ణ
పోరాటాలు: వెంకట్
కొరియోగ్రఫీ: బృందా, ప్రేమ్ రక్షిత్
వీఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్: యుగంధర్
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: అనిల్ వై, అశోక్ బి.
సీఈఓ: చెర్రీ
సుకుమార్ సమర్పించారు
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్లు: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇది మర్చిపోలేని అవార్డు అంటున్న శేఖర్ కమ్ముల