Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా లాక్ డౌన్: ఇడ్లీ బామ్మ ఆగలేదు.. రూపాయికి రెండు ఇడ్లీలు..

Advertiesment
workers
, మంగళవారం, 12 మే 2020 (18:55 IST)
Idly Grand mother
తమిళనాడులోని కోయంబత్తూర్‌ సమీపంలో ఉన్న వడివేలంపాలయం గ్రామానికి చెందిన 80 ఏళ్ల కమలాతాల్ ఒక్క రూపాయికే ఇడ్లీ అమ్ముతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఇడ్లీ బామ్మ.. కరోనా కష్టకాలంలో తనకు తోచినంతలో ఇతరులకు సాయం చేస్తోంది. కరోనా వైరస్‌తో చాలా మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలను ఆదుకుంటోంది. తాను చేసిన ఇడ్లీలను వలస కూలీలకు పెడుతూ ఎంతో పుణ్యం కట్టుకుంటోంది. 
 
లాక్ డౌన్ కారణంగా ఇడ్లీ వ్యాపారం అంతంతమాత్రంగా వున్నా.. బామ్మ మాత్రం రోజూ ఇడ్లీలు అమ్ముతోంది. గత 30 ఏళ్లుగా ఇడ్లీలు అమ్ముతూ జీవనం సాగిస్తోంది ఈ 80 ఏళ్ల బామ్మ. ఇక కరోనా వైరస్ మహమ్మారి కోరలు చాచినప్పటి నుంచి ఈ బామ్మ వ్యాపారం మరింతగా నష్టాల్లో కూరుకుపోయింది. అయితే ఈ సమయంలో ఆమెను ఆదుకునేందుకు వలస కూలీలు కూడా సహాయం చేస్తున్నారని చెప్పుకొచ్చింది. 
 
కొందరైతే ఇడ్లీ తయారీకి కావాల్సిన వస్తువులను పంపుతున్నారని గుర్తుచేసుకుంది. వారు పంపుతున్న సరుకులతో ఇడ్లీలు తయారు చేసి వలస కూలీలకు, పేద వారికి ఒక్క రూపాయికే అమ్ముతున్నట్లు వెల్లడించింది. గతంలో ఆ బామ్మ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భక్తులకు శ్రీవారి దర్శనం.. మాస్కులు, భౌతిక దూరంతో అనుమతి..