Webdunia - Bharat's app for daily news and videos

Install App

"‘బిగ్‌బాస్-3"కి నో చెప్పిన యంగ్ టైగర్.. మరి హోస్ట్ ఎవరు?

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (12:12 IST)
స్టార్ మా ఛానెల్‌‌లో ప్రసారమయ్యే బిగ్‌బాస్ కార్యక్రమం గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. కార్యక్రమం కంటే కూడా కార్యక్రమానికి సంబంధించిన వివాదాలతోనే పాపులర్ అయిపోయిన ఈ గేమ్‌షోకి తెలుగులో మొదటి సీజన్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక లెవల్‌కి తీసుకెళ్లడం జరిగింది. అయితే, రెండో సీజన్‌లో నాని మొదట్లో కాస్త తడబడ్డట్లు కనిపించినా... తర్వాత పుంజుకొని షో‌ని టాప్‌లో నిలబెట్టడానికి తన వంతు ప్రయత్నం చేసాడు. 
 
అయితే మధ్యలో కొందరు ఆర్మీ అంటూ హడావుడి చేసేయడంతో షో గతి తప్పేసిందనే భావన ఇప్పటికీ అందరిలోనూ ఉంది. బిగ్‌బాస్ సీజన్ 2 అంతా వన్ సైడ్ వార్‌లా జరిగినట్లుగా అంతా భావించడానికి కారణం హోస్ట్ ప్లేస్‌లో శాసించేవారు లేకపోవడమే అనే కామెంట్స్ కూడా ఆ మధ్య సామాజిక మాధ్యమాలలో గట్టిగానే వినిపించాయి. అంతేకాకుండా ఈ షో హైదరాబాద్ గడ్డపై జరగడం కూడా బిగ్‌బాస్ సీజన్ 2కు మైనస్‌గా అందరూ చెప్పుకొచ్చారు. కారణాలేమైనా సీజన్-2 మాత్రం సీజన్-1‌లా రక్తి కట్టలేకపోయిందని నెటిజన్లతోపాటు చాలా మంది అప్పట్లోనే పెదవి విరిచేసారు.
 
ఇక ఇప్పుడు సీజన్-3‌కి టైమ్ వచ్చేసింది. ఈ మధ్య సీజన్-3కి యంగ్ టైగర్ మరోసారి హోస్ట్‌ చేయనున్నారని టాక్ వచ్చినప్పటికీ... ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో రాంచరణ్‌తో కలిసి యంగ్ టైగర్ చేయబోతోన్న 'ఆర్ఆర్ఆర్' బిజీ షెడ్యూల్ కారణంగా ఎన్టీఆర్ ఈ షో‌కి టైమ్ కేటాయించలేనని చెప్పేసాడట. ఇప్పుడు బిగ్‌బాస్ సీజన్-3 కోసం కొత్త హోస్ట్‌ వేటలో ఉన్నారట ఈ కార్యక్రమ నిర్వాహకులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments