Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్లీజ్... ఒక్క నిమిషం అలా ఉండండి... వేడుకున్న జూ.ఎన్టీఆర్

Advertiesment
118 Pre Release Event
, మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (11:29 IST)
ఏ సినిమా ఫంక్షన్‌కి హాజరైనా చివరన 'మీ కోసం వేచి చూసే వారు ఉంటారు. జాగ్రత్తగా ఇంటికి వెళ్లండి. ఈ సంతోషాన్ని వారితో కూడా పంచుకోండి..' అంటూ అభిమానులకు చెబుతూ ఉండే నందమూరి యువ హీరో ఎన్టీఆర్... ఈసారి ప్రసంగం ప్రారంభంతోనే ఆకట్టుకునేసాడు...
 
వివరాలలోకి వెళ్తే... నందమూరి కల్యాణ్ రామ్ - షాలిని పాండేలు జంటగా నటించిన చిత్రం ‘118’. ఈ సినిమా ప్రీ రిలీజ్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌లో మాట్లాడేందుకు మైక్ అందుకున్న తారక్ ‘‘ముందుగా మీ అందరికీ ఓ విషయం చెప్పాలి. ఈ మధ్య జరిగిన ఓ ఘోరమైన సంఘటన గురించి మీ అందరికీ తెలిసిందే. 
 
మన దేశ భద్రత కోసం, మన భద్రత కోసం పని చేస్తున్న వారికి జరిగినటువంటి ఘోర సంఘటనకు గానూ.. మన దేశం కోసం అహర్నిశలూ కుటుంబాలను వదిలేసి పహారా కాస్తున్నటువంటి ఆ వీర జవాన్ల కోసం.. అలాగే ఈ మధ్య మా సినిమా ఇండస్ట్రీలో మేము కోల్పోయిన కొంత మంది దిగ్గజాల కోసం.. వీళ్లందరి ఆత్మకు శాంతి చేకూరాలని ఒక్క నిమిషం మౌనం పాటించాలని మిమ్మల్నందరినీ వేడుకుంటున్నాను’’ అని కోరాడు. 
 
ఈ మాటతో అక్కడ ఉన్న వారంతా నిలబడి మౌనం పాటించారు. అయితే దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ.. అతని అభిమానులే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా తారక్‌పై ప్రశంసల వర్షం కురిపించడానికి కారణం అవుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'గ్యాంగ్ లీడర్‌'గా నాని పనికిరాడా... నేచురల్ స్టార్‌కి మెగా కష్టాలు