Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీ ఓటు గల్లంతయ్యిందా? కంగారు పడకుండా.. ఇలా చేయండి.

Advertiesment
మీ ఓటు గల్లంతయ్యిందా? కంగారు పడకుండా.. ఇలా చేయండి.
, సోమవారం, 11 మార్చి 2019 (19:07 IST)
భారతదేశం మొత్తం సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. అన్ని పార్టీలు ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నాయి. మరోవైపు ఓటర్ల జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో అని కొంత మంది కంగారు పడుతున్నారు. అలాంటి వారి కోసమే వెబ్‌దునియా ఆ ప్రక్రియను మీకు వివరించనుంది.
 
తాజాగా తెలుగు రాష్ట్రాలలో నెలకొన్న పరిస్థితి దృష్ట్యా, ఓట్ల గల్లంతు ప్రక్రియ తారా స్థాయికి చేరింది. 
 
అందులోనూ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. రెండు రాష్ట్రాల ఎన్నికలు మొదటి ఫేజ్‌లో జరగనుండడంతో రాజకీయ పార్టీలు పరుగులు తీస్తున్నాయి. ఓటు అనేది ఐదేళ్లకొకసారి ఉపయోగించే ఆయుధం లాంటిది. ఈ క్రమంలో ఓటు వేసే ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ముందుగా ఓటర్ల జాబితాలో ఓటు ఉందో లేదోనని ముందు చెక్ చేసుకోండి. 
 
ఈ నెల 15వ తేదీ వరకు చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఓటు లేనట్లయితే ఫారమ్-6ని ఉపయోగించి మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో మీరు ఓటును కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించండి.
 
ఓటును ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోండి.
 
1) Googleలో https://www.nvsp.in/ అని టైప్ చేయండి. ఎన్నికల సంఘానికి సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది.
2) ఆ పేజీలో ఎడమవైపున Search అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి.
3) అది క్లిక్ చేసిన వెంటనే మరోపేజీ ఓపెన్ అవుతుంది. అది అప్లికేషన్ మాదిరి ఉంటుంది.
4) ఆ పేజీలో రెండు విభాగాలు ఉంటాయి. వీటిని ఉపయోగించి మనం ఓటును తనిఖీ చేసుకోవచ్చు.
 
5) మొదటి పేజీ(Search by Details)లో మనకు సంబంధించిన వివరాలను నమోదు చేసి, కోడ్‌ని ఎంటర్ చేస్తే మన ఓటు వివరాలు తెలుస్తాయి. ఒకవేళ పేజీలో ఏదైనా సమస్యగా ఉంటే రెండవ పేజీ కోసం అందులో ఉన్న రెండవ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
 
6) రెండవ ట్యాబ్‌(Search by EPIC No.)పై క్లిక్ చేసిన తర్వాత అందులో మూడు విభాగాలు ఉంటాయి. మొదటి విభాగంలో మన ఎలక్షన్ ఐడి నంబర్‌ను నమోదు చేసి, రెండవ పెట్టెలో రాష్ట్రం, అలాగే కోడ్‌ని నమోదు చేసి, శోధన(Search)పై క్లిక్ చేయండి.
 
7) మనకు సంబంధించిన వివరాలతో పాటు ఓటు వేయాల్సిన స్థలం, తండ్రి పేరు, వయస్సు మొదలైన సమాచారం మొత్తం అందులో కనిపిస్తుంది.
 
ఒకవేళ మీ వివరాలు అక్కడ కూడా లేనట్లయితే, మొదటి పేజీలో ఫారమ్-6(Form-6)ని పూరించి, ఎలక్షన్ కమీషన్‌కి దరఖాస్తును సమర్పించి, మీ ఓటును తిరిగి పొందండి. విలువైన మీ ఓటు పట్ల అశ్రద్ధ వహించకండి. ఓటు వేయాలంటే ఓటర్ల జాబితాలో మీ పేరు తప్పనిసరిగా ఉండాలి అని గుర్తుంచుకోండి. చివరి నిమిషంలో కంగారుపడవద్దు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్యాభర్తల గొడవ.. అక్రమ సంబంధం.. భర్తను తొడపై కాల్చేసింది..