Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

#TelanganaBudget రూ.1,82,017కోట్లు.. రైతు బంధు సాయం ఎకరానికి రూ.10వేలు

#TelanganaBudget రూ.1,82,017కోట్లు.. రైతు బంధు సాయం ఎకరానికి రూ.10వేలు
, శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (12:55 IST)
తెలంగాణ అసెంబ్లీలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టామని కేసీఆర్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఒకప్పుడు తెలంగాణ ప్రాంత వృద్ధి రేటు దేశ సగటు కన్నా తక్కువగా ఉండేది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు రెట్లు పెరిగిందని తెలిపారు. 
 
అన్ని రంగాలకు 24 గంటల పాటు విద్యుత్ ఇవ్వగలుగుతున్నామని కేసీఆర్ వెల్లడించారు. 2018-19 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 10.6శాతంగా నమోదైందని.. దివ్యాంగుల ఫింఛనును రూ.2వేల నుంచి  రూ.3,116కు పెంచుతున్నామని కేసీఆర్ తెలిపారు. 
 
వృద్ధాప్య పింఛన్‌కు కనీస వయసు అర్హతను 60 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించి, పెంచిన పింఛను అందిస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఆసరా పింఛన్ల కోసం ఈ బడ్జెట్‌లో రూ.12,067కోట్లు కేటాయిస్తున్నామని.. 2019-20 సంవత్సరానికి మొత్తం బడ్జెట్‌ రూ.1,82,017కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. 
 
తెలంగాణ  2019-20 తెలంగాణ బడ్జెట్ హైలైట్స్ 
2018-19 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 10.6శాతంగా నమోదు
నిరుద్యోగ భృతి కోసం రూ.1810కోట్లు
ఎస్సీల ప్రగతి కోసం రూ.16,581కోట్లు
ఎస్టీల అభ్యున్నతి కోసం రూ.9,827కోట్లు
మైనార్టీ సంక్షేమానికి రూ.2004 కోట్లు
రైతు రుణ మాఫీ కోసం రూ.6వేల కోట్లు
రెవెన్యూ వ్యయం రూ.1,31,629కోట్లు
 
మూలధన వ్యయం రూ.32,815కోట్లు
రెవెన్యూ మిగులు రూ.6,564కోట్లు 
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలకు రూ.1450కోట్లు.
రైతు బంధు సాయం ఎకరానికి రూ.10వేలు. ఇందు కోసం రూ.12వేల కోట్లు కేటాయింపు 
వ్యవసాయశాఖకు రూ.20,107కోట్ల కేటాయింపు
2019-20 బడ్జెట్‌లో నీటిపారుదలశాఖకు రూ.22,500కోట్లు కేటాయింపు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుల్వామా ఘటన అమానుషం.. అమరుల కుటుంబానికి రూ.25లక్షలు