Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికి సమయం - వయసుతో పనిలేదంటున్న బాలీవుడ్ భామ

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (11:40 IST)
బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా తన ప్రేమ, పెళ్లికి సంబంధించిన ప్రశ్నలతో విసిగిపోయిందో ఏమో కానీ మీడియాకి కొంచెం ఘాటుగానే సమాధానమిచ్చారు. వివరాలలోకి వెళ్తే... పరిణీతి చోప్రా ప్రస్తుతం అక్షయ్‌ కుమార్‌‌కి జోడీగా నటిస్తున్న ‘కేసరి’ సినిమా ప్రచారంలో కాస్త బిజీగానే ఉంది. ఇది 1897లో జరిగిన సారాగడీ యుద్ధంలో పదివేల మంది ఆప్ఘన్‌లతో పోరాడిన 21 మంది సిక్కు సైనికుల నేపథ్యంలో సాగే చిత్రం. ఈ నెల 21న సినిమా విడుదల కాబోతున్న ఈ చిత్ర ప్రచారంలో భాగంగా పరిణీతి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. 
 
ఈ సందర్భంగా ఇటీవల దర్శకుడు మనీష్‌ శర్మతోనూ, గతంలో సహాయ దర్శకుడు చరిత్‌ దేశాయ్‌తోనూ ప్రేమలో ఆవిడ ఉన్నట్లు వచ్చిన వార్తల గురించి ఆవిడని ప్రశ్నించడం జరిగింది. ఆ ప్రశ్నలకు స్పందించిన పరిణీతి.. ‘నిజంగా చెబుతున్నా.. నా ప్రేమ జీవితం గురించి మాట్లాడేందుకు నేను సిద్ధంగా లేను. ఇది సరయిన సమయం కాదు. ఆ విషయం ఎప్పుడు అందరికీ తెలియాలో అప్పుడే నా నుంచి తెలుస్తుంది. నేను అన్నీ దాస్తుంటాను అనేది చాలా మంది అభిప్రాయం. 
 
కానీ అది నిజం కాదు. జీవితంలో ప్రేమకు చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అన్నీ కుదిరినప్పుడు పెళ్లి చేసుకుంటా. వివాహానికి సమయం, వయసుతో పనిలేదు. అది ఓ వ్యక్తి మెంటల్‌ స్టేట్‌ మీద ఆధారపడి ఉంటుంది. నా మానసిక పరిస్థితి పెళ్లికి సిద్ధంగా ఉంటే.. రేపే నా పెళ్లి జరగొచ్చు. లేకపోతే మరో ఐదేళ్లు ఇలానే ఉండొచ్చు’ అంటూ చెప్పుకొచ్చారు. మరి ఈ ఊహాగానాలు ఇకనైనా ఆగుతాయో లేదో... చూద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పదవులపై ఆశలేదు.. జనసేన కార్యకర్తగానే ఉంటాను : నాగబాబు

'ఆపరేషన్ మహదేవ్' ... పహల్గాం ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్

గబ్బిలాల వేట.. చిల్లీ చికెన్ పేరుతో హోటళ్లకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సప్లై.. ఎక్కడ?

నెల్లూరులో ఏం జరిగిందంటే? ప్రియుడిని ఇంటికి పిలిపించి హత్య చేసింది

Flood Alert: గోదావరి నదికి వరదలు.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments