Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జూ.ఎన్టీఆర్‌లా స్టెప్ వేయాలని చతికిలబడ్డ తమిళ హీరో...

Advertiesment
జూ.ఎన్టీఆర్‌లా స్టెప్ వేయాలని చతికిలబడ్డ తమిళ హీరో...
, మంగళవారం, 12 మార్చి 2019 (21:50 IST)
జూ.ఎన్టీఆర్ నటించిన టెంపర్ చిత్రం తెలుగులో మంచి విజయం సాధించింది. ఈ సినిమా ఎన్టీఆర్‌కి ఒక కీలక మలుపు అని చెప్పవచ్చు. ప్రస్తుతం  తారక్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. టెంపర్ చిత్రం పలు బాషల్లో రీమేక్ అవుతోంది. ఇప్పటికే హిందీలో ఈ సినిమాను దర్శకుడు రోహిత్ శెట్టి రణ్‌వీర్ సింగ్ హీరోగా ‘సింబా’ టైటిల్‌తో చిత్రాన్ని తెరకెక్కించాడు. అక్కడ కూడా మంచి విజయం సాధించింది.
 
తమిళంలో హీరో విశాల్ అయోగ్య పేరుతో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాను ఏ.ఆర్. మురుగదాస్ శిష్యుడు వెంకట్ మోహన్ తెర‌కెక్కిస్తున్నాడు. రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో పార్థిపన్, కే.యస్.రవికుమార్‌లు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. 
 
తాజాగా ఎన్టీఆర్ వేసినట్లు స్టెప్స్ వేయాలనుకున్న హీరో విశాల్ గాయాలపాలయ్యాడు. ఓ కష్టమైన డ్యాన్స్ మూమెంట్ చేస్తూ అదుపుతప్పి ప్రమాదానికి గురైయ్యాడు. ఈ ప్రమాదంలో విశాల్ మోచేతికి, కాలికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న విశాల్ అభిమానులు ఆందోళనకు గురువుతున్నారు. ఏది ఏమైనా ఎన్టీఆర్‌లా డ్యాన్స్ వేయడం అంత ఈజీ కాదు అని మనోడికి అర్థమైనట్లుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డా.రాజ‌శేఖ‌ర్ అర్జున చిత్రం విడుదల వాయిదా... కార‌ణం ఏంటో తెలుసా..?