Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ల కిష్కింధపురి ఫస్ట్ లుక్

దేవీ
సోమవారం, 28 ఏప్రియల్ 2025 (10:21 IST)
Sai Srinivas, Anupama
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన 11వ మూవీ #BSS11ను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై చేస్తున్నారు. సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. గ్రిప్పింగ్ హర్రర్-మిస్టరీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండబోతోంది. 
 
మేకర్స్ ఇప్పుడు అఫీషియల్ గా సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కిష్కింధపురి అనే టైటిల్ మిస్టరీని, మైథాలజీ గ్రాండియర్ ని సూచిస్తోంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ఎక్సయిటింగ్ ఎక్స్ ప్రెషన్స్ తో కనిపిస్తున్నారు. 
 
చేతుల్లో జ్వాలలు పట్టుకుని, బెల్లంకొండ శ్రీనివాస్ , అనుపమ ఇద్దరూ అడవిలో ఏదో వెతుకుతున్నట్లు కనిపించారు. బ్యాక్ డ్రాప్ లో ఒక బంగ్లా కనిపిండం థ్రిల్లింగ్ వైబ్ ని పెంచుతోంది. టైటిల్, పోస్టర్ రెండూ అంచనాలను పెంచడంలో విజయవంతమయ్యాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా మేకర్స్ ఏప్రిల్ 29న సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు.
 
ఈ చిత్రానికి చిన్మయ్ సలాస్కర్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు, సంగీతం సామ్ సిఎస్ సమకూర్చారు. ప్రొడక్షన్ డిజైన్‌ను మనీషా ఎ దత్ నిర్వహిస్తున్నారు, డి. శివ కామేష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. నిరంజన్ దేవరమానే ఎడిటర్. ఈ ప్రాజెక్ట్ యొక్క క్రియేటివ్ హెడ్ జి. కనిష్క, సహ రచయిత దరాహాస్ పాలకొల్లు, స్క్రిప్ట్ అసోసియేట్ కె బాల గణేష్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments