Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Advertiesment
Naveen Chandra, Dr. Anil Vishwanath

దేవీ

, శనివారం, 29 మార్చి 2025 (19:19 IST)
Naveen Chandra, Dr. Anil Vishwanath
28°C సినిమా సినిమాను మొదట అడివి శేష్ కోసం అనుకున్నాం. అయితే శేష్ క్షణం తర్వాత బిజీ అవడం వల్ల కుదరలేదు. ప్రియదర్శిని అనుకున్నాం. తను బిజీతో చేయన్నాడు. ఆతర్వాత మరో హీరోను అనుకున్నాం. వాళ్ళ నాన్న తనే నిర్మాతగా తీస్తానన్నారు. కానీ అప్పటికే నా ఫ్రెండ్ వున్నాడని అన్నాను. అలా సాధ్యపడలేదు. ఆ తర్వాత నవీన్ చంద్రకు స్క్రిప్ట్ చెబితే ఆయనకు బాగా నచ్చి చేసేందుకు ముందుకొచ్చారు అని ఈ మూవీ హైలైట్స్ తెలిపారు డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్.
 
ఇక కథ ప్రకారం జార్జియాలో 25 డేస్ షూటింగ్ చేశాం. ఆ షెడ్యూల్ కోసం మేము పడిన కష్టం మాటల్లో చెప్పలేను. అనవసరంగా జార్జియా షెడ్యూల్ రాశాఅని ఫీల్ అయ్యా. అనివార్య కారణాలతో రెండుసార్లు జార్జియాకు వెళ్లకుండా అధికారులు తిరిగి పంపేశారు. థర్డ్ టైమ్ మేము అక్కడికి వెళ్లి షూట్ చేయగలిగాం. మూడోసారి కెమెరా కిట్స్ ఉన్నబ్యాగులు మిస్ అయ్యాయి. జార్జియాలో షాపింగ్ చేసి వాటిని కొని షూటింగ్ చేశాం. ఇలాంటి ఎక్సిపీరియన్స్ లు చాలా ఉన్నాయి కాబట్టే "28°C" సినిమా అనుభవాలతో పుస్తకం రాయాలని అనుకున్నా.
 
- నా నెక్ట్స్ మూవీ పొలిమేర 3  త్వరలో సెట్స్ మీదకు తీసుకెళ్తాం. ఇది పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో ఉంటుంది. సీజీ వర్క్ భారీగా ఉండబోతోంది. అందుకే ప్రీ ప్రొడక్షన్ కు ఎక్కువ టైమ్ పట్టింది. వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ కు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. పొలిమేర 3 పాన్ ఇండియా స్థాయిలో భారీ ప్రొడక్షన్ వ్యాల్యూతో ఉంటుంది. ఇందులో ఓ స్టార్ కీలక పాత్రలో నటిస్తారు.
 
- నేను షో రన్నర్ గా నా టీమ్ మెంబర్ నాని కాసరగడ్డ డైరెక్షన్ లో అల్లరి నరేష్ తో 12ఎ రైల్వే కాలనీ మూవీ చేస్తున్నాం. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాశాను. నేను కెరీర్ మొదలుపెట్టినప్పుడు నాకు పెద్దగా సపోర్ట్ లేదు. నాకున్న గుర్తింపుతో ఇప్పుడు నా కొలీగ్స్ కు నేను ఆ సపోర్ట్ ఇవ్వాలని భావిస్తున్నా. నాకు షెర్లాక్ హోమ్స్ సాహిత్యం ఇష్టం. త్వరలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాను.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్