Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లయ, నేను కలసి సినిమా చేస్తున్నాం, 90sకి సీక్వెల్ వుంటుంది : శివాజీ

Advertiesment
Actor Sivaji

దేవీ

, శుక్రవారం, 14 మార్చి 2025 (16:45 IST)
Actor Sivaji
నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్స్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ 'కోర్ట్' - స్టేట్ వర్సెస్ ఎ నోబడీ'. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ప్రిమియర్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

మార్చి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో యునానిమస్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో చిత్రంలో మంగపతి పాత్ర పోషించిన యాక్టర్ శివాజీ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
 
మంగపతి లాంటి పవర్ ఫుల్ పాత్రతో రావడం ఎలా అనిపించింది ?
- దాదాపు 12 ఏళ్ల తర్వాత నా ఫ్యామిలీ, పిల్లలు నన్ను మళ్ళీ యాక్ట్ చేయమని కోరేవారు. నాకూ చేయాలని వుండేది కానీ నేను ఎవరినీ అడగలేను. ఈటీవీ బాపినీడు గారిని కలిసి విషయం చెప్పాను. ముందుగా ప్రొడక్షన్ చేద్దామని అనుకున్నాం. అయితే ఆయన యాక్ట్ చేయమని చెప్పారు. అలా 90s వెబ్ సిరిస్ ఓకే చేశాను. అది చేస్తున్నప్పుడు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. నేను ఏంటో తెలియజేసే వేదిక అది. నేచర్ ఈ అవకాశం పంపించిందనుకుని వెళ్లాను. ఆ  షోతో అసలు శివాజీ ఏమిటో ప్రపంచానికి తెలిసింది. అదే సమయంలో వెబ్ సిరిస్ కూడా పెద్ద హిట్ అయ్యింది. దాని తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. దాదాపు ఎనభై కథలు విన్నాను. చాలా వరకూ ఫాదర్ రోల్స్ వున్నాయి అందులో. చాలా వరకూ రిజెక్ట్ చేశాను. కోర్ట్ లో చేసిన మంగపతి క్యారెక్టర్ నా 25 ఏళ్ల కల.  నాని గారి ద్వారా ఈ అవకాశం రావడం చాలా ఆనందంగా వుంది.
 
మంగపతి పాత్రని ఎంచుకున్న తర్వాత ఎలాంటి సవాళ్ళు ఎదురుకున్నారు?
-ఏం చూసి ఈ క్యారెక్టర్ కి నన్ను సెలెక్ట్ చేసుకున్నారని డైరెక్టర్ గారిని అడిగాను. పగలంతా స్క్రిప్ట్ రాసుకొని నైట్ టీవీ ముందు కూర్చుంటే మీరు కనిపించేవారు. ఆ పాత్రకి పర్ఫెక్ట్ గా యాప్ట్ ని సెలెక్ట్ చేసుకున్న అని చెప్పాడు. నా కోసం ఇలాంటి క్యారెక్టర్ పుట్టిందని భావిస్తున్నాను. డైరెక్టర్ రియల్ లైఫ్ నుంచి ఈ క్యారెక్టర్ తీసుకున్నాడని భావిస్తున్నాను. నా పాత్రకి సంబధించిన ప్రతిది డైరెక్టర్ క్రెడిట్. నేను ఇది చేయగలనని ప్రూవ్ చేసుకునే అవకాశం ఇచ్చాడు. నా క్యారెక్టర్ ని డైరెక్టర్ నెక్స్ట్ లెవల్ లో రాసుకున్నాడు. ఇందులో ప్రతి పాత్రని శిల్పం చెక్కినట్లుగా చెక్కాడు.  
 
ఎస్వీ రంగారావు గారు గుమ్మడి గారు జగ్గయ్య గారు రాజనాల గారు మరపురాని పాత్రలు చేశారు. అలాంటి పాత్రలు చేయాలని నాకు వుండేది. హీరోగా స్టిక్ అవ్వాలనే ఆలోచన నాకూ ఎప్పుడూ లేదు. జల్సా, ఒట్టేసి చెబుతున్నా, మనసుంటే చాలు లాంటి సినిమాల్లో చేసిన పాత్రలు అలా చేసినవే.  
 
-మంగపతి క్యారెక్టర్ కి వచ్చిన రెస్పాన్స్ చాలా సంతోషాన్ని ఇచ్చింది. యానిమల్ లో బాబీ డియోల్ కంటే బాగా చేశాడని ఒకరు రివ్యూ రాశారు. ఆ మాట విన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది.
 
నాని గారితో మీ బాండింగ్ గురించి ?
-నాని గారు యాక్టర్ గా ప్రూవ్ చేసుకున్నారు. నిర్మాతగా ఆయనపై చాలా గౌరవం వుంది. కొత్త వారిని ప్రోత్సాహించడంలో గొప్ప చొరవ చూపిస్తున్నారు.  సూపర్ గుడ్ ఫిలిమ్స్, సురేష్ ప్రొడక్షన్, ఉషా కిరణ్ లాంటి బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా అవుతుంది.
 
-కొత్తవారు చేసిన సినిమాకి తన సినిమాని పణంగా పెట్టి ఛాలెంజ్ విసరడం మామూలు విషయం కాదు. అది సినిమాపై ఆయనకి వున్న నమ్మకం. నాని గారి బ్యానర్ లో ఈ సినిమా చేయడం నా అదృష్టం.
 
మంగపతి తరహలో మరో పాత్ర ఏదైనా విన్నారా ?
-మెడికల్ షాప్ మూర్తి అనే ఓ క్యారెక్టర్ విన్నాను. త్వరలోనే వాళ్ళు అనౌన్స్ చేస్తారు.
 
సినిమాలకి దూరమావ్వడం రిగ్రెట్ గా ఫీలయ్యారా?
-లేదండీ. నేను ప్రజల కోసం నిలబడ్డాను. ప్రాంతం కోసం, బావితరాల కోసం పోరాటం చేశాను. ఇందులో ఎలాంటి రిగ్రెట్ లేదు. ఎప్పటికీ ప్రజల తరపున వుంటాను.
 
నెక్స్ట్ చేస్తున్న ప్రాజెక్ట్స్ ?
-లయ, నేను కలసి ఓ సినిమా చేస్తున్నాం. అలాగే దండోరా అనే సినిమా చేస్తున్నాను. 90sకి సీక్వెల్ వుంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Sankranthiki Vastunnam : సంక్రాంతికి వస్తున్నాం రికార్డు బద్ధలు.. ఓటీటీ, టీఆర్పీ రేటింగ్స్‌ అదుర్స్