Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

Advertiesment
Naveen Chandra, Shalini

దేవీ

, శనివారం, 22 మార్చి 2025 (20:10 IST)
Naveen Chandra, Shalini
"పొలిమేర" దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్  మొదటి సినిమా "28°C".  ఈ నెల 28న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. నవీన్ చంద్ర హీరోగా షాలినీ వడ్నికట్టి హీరోయిన్ గా నటించారు. వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ సాయి అభిషేక్ నిర్మిస్తున్నారు. ఈ రోజు ఈ సినిమా నుంచి 'చెలియా చెలియా..' సాంగ్ రిలీజ్ చేశారు.
 
'చెలియా చెలియా..' సాంగ్ ను మ్యూజిక్ డైరెక్టర్ శ్రావణ్ భరద్వాజ్ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేయగా...కిట్టు విస్సాప్రగడ మంచి లిరిక్స్ అందించారు. సింగర్ రేవంత్ ఆకట్టుకునేలా పాడారు. 'చెలియా చెలియా..' పాట ఎలా ఉందో చూస్తే - 'నీ నగుమోము కనులారా, చూస్తుంటే క్షణమైనా, కనురెప్ప వాలేనా, నా కనుసైగ నీ వెనకా, వెంటాడే మౌనంగా, వేచిందే నువు రాక, ఊహలలో ఊరిస్తూ, దాగినది చాలుగా, ఊరటగా నా ఎదురు నా జతగా రా, చెలియా చెలియా నిన్ను చూడంగ, చెలియా చెలియా కనులు చాలవుగా..' అంటూ మంచి లవ్ ఫీల్ తో సాగుతుందీ పాట.
 
మనసును తాకే భావోద్వేగాలతో ఆద్యంతం సాగే అద్భుతమైన ప్రేమ కథా మూవీ ఇదని చిత్ర దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్  తెలిపారు. ఈ చిత్రంతో హీరో నవీన్ చంద్ర మరోసారి ఎమోషనల్ ప్రేమకథలో తన నటనతో ఆకట్టుకోబోతున్నాడు. లవ్ స్టోరీ మూవీలో ఉండాల్సిన అన్ని ఎమోషన్స్ తో "28°C" సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. టెంపరేచర్ కథలో ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది అనేది, ఒక డిఫరెంట్ స్టోరీ స్క్రీన్ ప్లేతో ఈ సినిమా తెరకెక్కింది. "28°C" సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్