Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శివ తాండవం ప్రేరణతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భైరవం థీమ్ సాంగ్‌

Advertiesment
Bhairavam Theme Song

దేవి

, శనివారం, 22 ఫిబ్రవరి 2025 (10:20 IST)
Bhairavam Theme Song
శివ తాండవం ప్రేరణతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భైరవం థీమ్ సాంగ్‌ చేశారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని  శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్ పై  కెకె రాధామోహన్ నిర్మించారు, పెన్ స్టూడియోస్‌ డాక్టర్ జయంతిలాల్ గడా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. ఈరోజు, మేకర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భైరవం థీమ్ సాంగ్‌ను విడుదల చేశారు.  చైతన్య ప్రసాద్ రాసిన సాహిత్యం, శివుని దైవిక సారాన్ని అందంగా ప్రజెంట్ చేసి, లోతుగా ప్రతిధ్వనించే ఎమోషన్స్ ని అందించింది.
 
ఈ పాటకు శంకర్ మహదేవన్ అద్భుతమైన వోకల్స్ గొప్ప శక్తిని నింపింది. బెల్లంకొండ శ్రీనివాస్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇస్తూ, శివుని ఫియర్, స్ట్రెంత్ రెండింటినీ కనబరిచారు. అతని ఎక్స్ ప్రెస్షన్స్, మూమెంట్స్ డివైన్ ఎనర్జీని అందించాయి. తన పాత్ర శివ తాండవం ప్రేరణ స్ఫూర్తితో మెస్మరైజ్ చేస్తోంది. క్యారెక్టర్ ఇంటెన్స్ పవర్ అద్భుతంగా వుంది.
 
ఒక ఆలయం ముందు చిత్రీకరించబడిన విజువల్స్ అద్భుతంగా వున్నాయి. పాటకు ఆధ్యాత్మికతని జోడిస్తాయి. మహా శివరాత్రి ఉత్సవాలు ఇప్పటికే ప్రారంభమవుతున్నందున, ఈ పాట భైరవం పై అంచనాలను మరింత పెంచింది.
 
ఈ చిత్రంలో నారా రోహిత్, మనోజ్ మంచు, అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్ళై ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి డీవోపీ హరి కె వేదాంతం, ఎడిటింగ్  చోటా కె ప్రసాద్. ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మ కడలి. సత్యర్షి,  తూమ్ వెంకట్ డైలాగ్స్ రాశారు.
 భైరవం సమ్మర్ థియేట్రికల్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది.
 తారాగణం: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్, అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాలోని కాన్ఫిడెన్స్ తో చెపుతున్నా కోర్ట్ సినిమాలో ఎవరు హీరో అని చెప్పడం కష్టం : నాని