Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాలోని కాన్ఫిడెన్స్ తో చెపుతున్నా కోర్ట్ సినిమాలో ఎవరు హీరో అని చెప్పడం కష్టం : నాని

Advertiesment
Nani, Priyadarshi, Ram Jagadish, Prashanthi Tipirneni, Deepti Ganta, Roshan, Sridevi

దేవి

, శనివారం, 22 ఫిబ్రవరి 2025 (10:08 IST)
Nani, Priyadarshi, Ram Jagadish, Prashanthi Tipirneni, Deepti Ganta, Roshan, Sridevi
నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పించిన మూవీ 'కోర్ట్' - స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న నటిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్  ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కి మూవీ ప్రెజంటర్ నేచరల్ స్టార్ నాని చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.
 
నాని మాట్లాడుతూ.. వీళ్ళందరితో 'కోర్టు' సినిమాని తీసి నేరం చేసింది నేనే. కావాలంటే అరెస్ట్ చేసుకోండి.(నవ్వుతూ) కానీ మార్చి 14 సినిమాని బ్లాక్ బస్టర్ చేయండి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలి. వెరీ బ్యూటీఫుల్ ఫిల్మ్. దర్శి, రోషన్, శ్రీదేవి, డైరెక్టర్ జగదీశ్ అందరూ అద్భుతంగా చేశారు. ఈ సినిమా తీసినందుకు గర్వపడుతున్నాను. నాలోని కాన్ఫిడెన్స్ చూసి మీరే డిసైడ్ అవ్వండి..మార్చి 14న మీరు ఎంత మంచి సినిమా చూడబోతున్నారో. ఈ సినిమా చూశాను. ఇందులో ఎవరు హీరో అని చెప్పడం కష్టం. ఈ కథ చాలా సెన్సిటివ్ మేటర్. చాలా జాగ్రత్తలు తీసుకొని చేశాం. జగదీశ్ చాలా రీసెర్చ్ చేశారు. సినిమా పూర్తయినప్పటికీ నిలబడి క్లాప్స్ కొడతారు. ఇది నా గ్యారెంటీ. కోర్ట్ మూవీ గ్రేట్ ఐడియా, బ్యూటీఫుల్ లవ్ స్టొరీ. చాలా గ్రిప్పింగ్ డ్రామా. మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్. ఇది అద్భుతమైన కోర్ట్ రూమ్ డ్రామా. గ్రేట్ మెసేజ్ వుంటుంది. ఆడియన్స్ సెలబ్రేట్ చేసుకునే సినిమా అవుతుంది. జగదీశ్ చాలా హానెస్ట్ గా కథ చెప్పాడు. నేను అనుకున్న దానికంటే నెక్స్ట్ లెవల్ లో తీశాడు. కోర్టు సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇలాంటి సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఇండస్ట్రీ, ఆడియన్స్ ఒక అడుగు ముందుకి వేసినట్లే. ఎలాంటి సినిమాలు చేయడానికి ఇష్టపడతానో మీ అందరికీ తెలుసు. మార్చి 14న ఇంకోసారి క్లారిటీ వస్తుంది. ఒక కోర్ట్ రూమ్ డ్రామా చూసినప్పుడు ఆడియన్స్ కావాల్సిన అన్ని హైస్ ఇందులో వుంటాయి'అన్నారు.
 
నిర్మాత దీప్తి గంటా మాట్లాడుతూ.. నాని, ప్రశాంతి ప్రొడక్షన్ హౌస్ లో రెగ్యులర్ ప్రొడ్యూసర్ రూల్ బుక్ వుండదు. కథ నచ్చితే ఎంత అయినా పెడతారు. మా టీం విషయంలో చాలా ప్రౌడ్ గా వున్నాను. జగదీశ్ అద్భుతమైన స్క్రిప్ట్ రాశారు. అంతే అద్భుతంగా సినిమాని తీశాడు. మార్చి 14న చాలా మంచి సినిమా చూడబోతున్నారు. నిర్మాతగా ఈ అవకాశం ఇచ్చిన నానికి థాంక్ యూ. కోర్ట్ గ్రేట్ ఫిల్మ్. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది'అన్నారు  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పర్యావరణ నేపథ్యంలో ఆదిత్య ఓం బంధీ అయ్యాడు !