Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పర్యావరణ నేపథ్యంలో ఆదిత్య ఓం బంధీ అయ్యాడు !

Advertiesment
Aditya Om

దేవి

, శనివారం, 22 ఫిబ్రవరి 2025 (09:55 IST)
Aditya Om
వాతావరణ పరిరక్షణపై సామాజిక సందేశాన్ని ఇస్తూ ఆదిత్య ఓం చేసిన చిత్రం ‘బంధీ’. రఘు తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గల్లీ సినిమా బ్యానర్‌పై నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని పలు అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించారు. ప్రతిష్టాత్మక చలన చిత్రోత్సవాలలో బంధీ చిత్రానికి అనేక ప్రశంసలు దక్కాయి.
 
భారతదేశపు మొట్టమొదటి పర్యావరణ నేపథ్యంతో కూడిన థ్రిల్లర్‌గా బంధీ రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో ఆదిత్య ఓం పాత్ర ఎదుర్కొనే పరిస్థితులు, వాతావరణ సమస్యలపై పోరాడే తీరు అద్భుతంగా ఉండబోతోంది.. భారతదేశంతో పాటు ఇతర విదేశాల్లోని అనేక అటవీ ప్రాంతంలో రియల్ లొకేషన్స్ మధ్య బంధీ చిత్రాన్ని తెరకెక్కించారు. అద్భుతమైన విజువల్స్‌ను ఈ చిత్రంలో చూడబోతోన్నాం. పర్యావరణ ప్రేమికులందరినీ కదిలించేలా ఈ చిత్రం ఉండనుంది. 
 
ఎంతో డెడికేటెడ్ యాక్టర్ అయిన ఆదిత్య ఓం బంధీ చిత్రంలో ఎన్నో రియల్ స్టంట్స్ చేశారు. అటవీ ప్రాంతంలో అనేక ఛాలెంజ్‌లు ఎదుర్కొంటూ అద్భుతంగా నటించారు. ఈ మూవీని ఇక ఆడియెన్స్ ముందుకు తీసుకు రావాలని మేకర్లు నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి 28న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతోన్నట్టుగా ప్రకటించారు.
 
ఈ మూవీ కోసం మేకర్లు ఓ వ్యూహాన్ని రచించారు. ముందుగా ఈ చిత్రాన్ని కొన్ని పరిమిత స్క్రీన్లలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఆ తరువాత ప్రేక్షకుల రెస్పాన్స్‌ను బట్టి.. స్క్రీన్‌లు, షోలు పెంచుకుంటూ వెళ్లాలని నిర్ణయించకున్నారు. నిర్మాతలు వెంకటేశ్వర్ రావు దగ్గు, రఘు తిరుమల ఈ చిత్ర ప్రమోషన్స్ కోసం NGOలు, సామాజిక సంస్థలతో కలిసి ప్రమోషన్స్ చేస్తున్నారు. టీజర్, ట్రైలర్‌లకు మంచి ఆదరణ లభించడంతో సినిమా విడుదలపై మరింత ఉత్కంఠ నెలకొంది. బంధీ చిత్రాన్ని ఫిబ్రవరి 28న గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్లు సిద్దంగా ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాతృ మూవీ నుంచి మదర్ సెంటిమెంట్ తో అపరంజి బొమ్మ. పాట