Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లాస్ట్ ఇయర్ మొత్తం గాలిలోనే రోప్స్ పై స్టంట్స్ చేస్తూ ఉన్నా : మంచు లక్ష్మి

Advertiesment
Manchu Lakshmi

డీవీ

, బుధవారం, 10 జులై 2024 (09:11 IST)
Manchu Lakshmi
మంచులక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన సినిమా "ఆదిపర్వం". శివకంఠంనేని, ఆదిత్య ఓం, ఎస్తర్ నోరోనా, శ్రీజిత ఘోష్, వెంకట్ కిరణ్, సత్యప్రకాష్, సుహాసిని ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని రావుల వెంకటేశ్వర రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్,  ఏఐ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ, మలయాళంలో పీరియాడిక్ డ్రామాగా "ఆదిపర్వం" సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు సంజీవ్ మోగోటి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న "ఆదిపర్వం" సినిమా త్వరలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.
 
ప్రమోషన్ లో భాగంగా..  మంచు లక్ష్మి మాట్లాడుతూ - "ఆదిపర్వం" లాంటి భారీ చిత్రాన్ని ఇంత త్వరగా సీజీ వర్క్ తో సహా కంప్లీట్ చేస్తారని నేను అనుకోలేదు. ఈ సినిమాకు ఒక భగీరథ ప్రయత్నం చేశారు మా దర్శకుడు సంజీవ్ గారు. ఆయన థ్యాంక్స్ చెబుతున్నా. టీమ్ అంతా ప్యాషన్ తో కష్టపడి పనిచేశారు. నేను లాస్ట్ ఇయర్ మొత్తం గాలిలోనే రోప్స్ పై స్టంట్స్ చేస్తూ ఉన్నాను. అంత యాక్షన్ చేయించారు ఈ సినిమాకు. మూడు లొకేషన్స్ లో వర్క్ చేశాను. "ఆదిపర్వం" టీమ్ అందరికీ థ్యాంక్స్. ఇలాంటి సోషియో ఫాంటసీ కథల్ని ప్రేక్షకులకు చూపిస్తున్నాం అంటే అది మన నేల గొప్పదనం. ఈ శక్తవంతమైన గడ్డ మీద ఉన్నాం కాబట్టే ఇలాంటి నేపథ్యాలతో సినిమాలు చేయగలుగుతున్నాం. ఔట్ ఆఫ్ ది వరల్డ్ క్యారెక్టర్స్ కథలు అంటే నా దగ్గరకే వస్తున్నారు. రీసెంట్ గా యక్షిణి వెబ్ సిరీస్ చేశాను. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు "ఆదిపర్వం" చేశాను. దేవత అయినా దెయ్యం అయినా నన్నే అప్రోచ్ అవుతున్నారు. "ఆదిపర్వం" మీ అందరికీ నచ్చేలా ఉంటుందని చెప్పగలను. అన్నారు.
 
దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ - "ఆదిపర్వం" సినిమాకు తన పూర్తి సపోర్ట్ అందించిన రావుల వెంకటేశ్వర రావు గారికి, ఇతర సహ నిర్మాతలకు, ఘంటా శ్రీనివాసరావు గారికి థ్యాంక్స్. "ఆదిపర్వం" లాంటి భారీ చిత్రాన్ని ఇంత త్వరగా పూర్తి చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో వందలాది మంది కొత్త నటీనటులు నటించారు. మా ప్రాజెక్ట్ లోకి మంచు లక్ష్మి గారు రావడంతో ప్రాజెక్ట్ స్వరూపమే మారిపోయింది. సినిమాకు క్రేజ్ ఏర్పడింది. ఆమె నాగులాపురం నాగమ్మ క్యారెక్టర్ లో "ఆదిపర్వం"లో నటించారు. ఈ సినిమా కోసం ఆమె చేసిన యాక్షన్ సీక్వెన్సులు హైలైట్ అవుతాయి. 50 ఫీట్స్ నుంచి దూకే స్టంట్స్ మంచు లక్ష్మి చేశారు. ఆమె డెడికేషన్ కు హ్యాట్సాఫ్. అన్నారు.
 
నటుడు శివ కంఠమనేని, లిరిసిస్ట్ సాగర్ నారాయణ్మ్యూ, జిక్ డైరెక్టర్ దొంతం ప్రవీణ్ తదితరులు మాట్లాడారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

10న చియాన్ విక్రమ్ "తంగలాన్" సినిమా ట్రైలర్ రిలీజ్