Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆదిపర్వం పాటలు అదిరిపోయాయంటూ ప్రముఖ సంగీత దర్శకుల మెచ్చుకోలు

Manchu lakshmi

డీవీ

, గురువారం, 11 ఏప్రియల్ 2024 (15:44 IST)
Manchu lakshmi
ఆదిపర్వం" ఇది అమ్మవారి కథ, అమ్మవారిని నమ్ముకున్న ఓ భక్తురాలి కథ, ఆ భక్తురాలిని దుష్ట శక్తుల నుండి కాపాడే ఓ క్షేత్రపాలకుడి కథ. ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సంజీవ్ కుమార్ మేగోటి దర్శకుడు.
 
రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్ - ఎ.ఐ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో ఐదు భాషల్లో (తెలుగు - కన్నడ - హిందీ - తమిళ - మలయాళ) ఈ సినిమా రూపుదిద్దుకుంది. 1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కి... ఇటీవల ఐదు భాషల్లోనూ విడుదలైన ట్రైలర్ కు విశేష స్పందన లభిస్తోంది.

webdunia
adiparvam meet
తాజాగా ఈ చిత్రం పాటలు అన్విక ఆడియో ద్వారా విడుదలయ్యాయి. సంచలన సంగీత దర్శకులు ఆర్.పి.పట్నాయక్, ఎమ్.ఎమ్. శ్రీలేఖ, రఘు కుంచె, ఘంటాడి క్రిష్ణ పాటల వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భాజపా నాయకులు మరియు నిర్మాత చీర్ల శ్రీనివాస యాదవ్, జనసేన నాయకులు యనమల భాస్కరరావు, 'డాన్స్ మాస్టర్' సన్ రేస్, ఆల్ ఇండియా రేడియో స్టేషన్ డైరెక్టర్ వి.ఉదయ శంకర్ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు.
 
ఆర్.పి.పట్నాయక్, ఎమ్.ఎమ్.శ్రీలేఖ, రఘు కుంచె, ఘంటాడి కృష్ణ "ఆదిపర్వం" గీతాలను ఆవిష్కరించారు.
ఆడియో వేడుకలో గీత రచయితలు, గాయనీగాయకులు, సంగీత దర్శకులకు సముచిత స్థానం కల్పించడమనే సత్సంప్రదయాన్ని పునః ప్రారంభించిన దర్శకనిర్మాతలు అభినందనీయులని వారు పేర్కొన్నారు. పాటలు చాలా బాగున్నాయని, ఈ చిత్రం సాధించే విజయంలో ఇవి తప్పకుండా ముఖ్యపాత్ర పోషిస్తాయని మిగతా అతిధులు అభిలషించారు. చిత్ర దర్శకుడు సంజీవ్ కుమార్ మేగోటి మాట్లాడుతూ..."బహు భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఇంత బాగా రావడానికి మాకు సహకరించిన మా ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మి గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం"అన్నారు.
 
మంచులక్ష్మీ, ఆదిత్య ఓం, ఎస్తర్ నోరోనా, శ్రీజిత ఘోష్,  శివకంఠంనేని , వెంకట్ కిరణ్, సత్యప్రకాష్, సుహాసిని, హ్యారీజోష్, సమ్మెటగాంధీ, యోగికత్రి, గడ్డం నవీన్, ఢిల్లీ రాజేశ్వరి, జెమినీ సురేష్, బీఎన్ శర్మ, శ్రావణి, అయేషా, రావుల వెంకటేశ్వర్ రావు, సాయి రాకేష్, వనితారెడ్డి, గూడా రామకృష్ణ, రవిరెడ్డి, దేవిశ్రీ ప్రభు,  దుగ్గిరెడ్డి వెంకటరెడ్డి, రాధాకృష్ణ, స్నేహ, లీలావతి, శ్రీరామ్ రమేష్, కైపా ప్రతాప్ రెడ్డి, జ్యోతి, శ్రీరామ్, రాఘవేంద్ర, అమృత్,రాజ్ కుమార్, చిల్లూరి రామకృష్ణ, జోగిపేట ప్రేమ్ కుమార్ (జాతిరత్నాలు), పద్మారావు, సునీల్, మల్లి, నాగరాజు, మృత్యుంజయ శర్మ తదితరులతోపాటు దాదాపు రెండు వందలమందికి పైగా నటీనటులు నటించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్వచ్చమైన తెలుగింటి టైటిల్ సఃకుటుంబానాం ఫస్ట్ లుక్