Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హిందూయిజం సారాంశంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్రం హైందవ

Bellamkonda Sai Srinivas- Haindava

డీవీ

, బుధవారం, 8 జనవరి 2025 (18:42 IST)
Bellamkonda Sai Srinivas- Haindava
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, డైరెక్టర్ లుధీర్ బైరెడ్డి దర్శకత్వం వహిస్తున్న చిత్రాన్ని మూన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేష్ చందు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లతో చాలా క్యురియాసిటీ క్రియేట్ చేశాయి. సంయుక్త ఫీమేల్ లీడ్ గా నటిస్తున్న ఈ హై-బడ్జెట్ మూవీ కథ శతాబ్దాల నాటి దశావతార ఆలయం చుట్టూ వుంటుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌తో వచ్చిన మేకర్స్ బ్రెత్ టేకింగ్ గ్లింప్స్ ద్వారా సినిమా టైటిల్‌ను లాంచ్ చేశారు.
 
గ్లింప్స్ ఒక దట్టమైన అడవిలో సెట్ చేయబడిన టెర్రిఫిక్ విజువల్ తో ఓపెన్ అయింది. ఒక దుండగుల బృందం పవిత్రమైన దశావతార ఆలయానికి నిప్పు పెట్టడం ద్వారా దానిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బైక్‌ నడుపుతూ పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చారు. సింహం, అడవి పంది వెంటరావడం, డేగ (గరుడ) పైకి ఎగురడం కనిపిస్తోంది. ఆలయ చెరువులోని చేపలు కోపంతో దూకుతున్నాయి, తాబేలు గమనించడం ఆసక్తికరంగా వుంది. హీరో చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆలయంలోని నాగదేవత (ఆదిశేష అవతారం)కి అద్దం పడుతుంది
 
ఆలయాన్ని ధ్వంసం చేసే ప్రయత్నాన్ని హీరో అడ్డుకోవడంలో పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ఒక పవర్ ఫుల్ మూమెంట్ లో అతను ఒక ఎద్దుల బండిని తగులబెట్టాడు, విలన్‌లను దారంతో బంధిస్తాడు, మంటలు పవిత్రమైన విష్ణు నామాలు ఆకారాన్ని ఏర్పరుస్తాయి. ఈ మూలాంశం సింహం, అడవి పంది ముఖాలపై కూడా కనిపిస్తుంది, ఆకాశంలో విష్ణువు బహుళ రూపాలు కనిపిస్తాయి. చివరగా, హిందూయిజం సారాంశంతో ప్రతిధ్వనించే 'హైందవ' టైటిల్‌ను  రివిల్ చేశారు. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ చిత్రానికి ఇది నిజంగా గొప్ప పాన్-ఇండియా టైటిల్.
 
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రగ్గడ్ లో పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు, అతని మాచో అవతార్‌ అదిరిపోయింది. అతని స్క్రీన్ ప్రెజెన్స్ కట్టిపడేసింది.
 
విజువల్స్ అద్భుతంగాఉన్నాయి, ప్రతి క్షణం ఇంటెన్స్ ని పెంచే శివేంద్ర కెమెరావర్క్ బ్రిలియంట్ గా వుంది. లియోన్ జేమ్స్ కంపోజ్ చేసిన పవర్ ఫుల్ బ్యాక్‌డ్రాప్ స్కోర్‌తో ఆధ్యాత్మిక వాతావరణం ఎలివేట్ చేసింది, రామ కృష్ణ కీర్తనలు ట్రాన్స్ లాంటి అనుభూతిని ఇచ్చాయి.
 
విష్ణు అవతారాలు, నామాలు బ్యాక్ డ్రాప్ లో డైరెక్టర్ లుధీర్ బైరెడ్డి డైరెక్షన్, విజన్ కట్టిపడేసింది. మూన్‌షైన్ పిక్చర్స్ అత్యద్భుతమైన CG వర్క్,  అత్యున్నత స్థాయి నిర్మాణం సినిమాను ఎలివేట్ చేశాయి. ఎడిటర్ కార్తీక శ్రీనివాస్ R, ఆర్ట్ డైరెక్టర్ శ్రీనాగేంద్ర తంగాల నైపుణ్యం ప్రతి ఫ్రేమ్‌లో కనిపించింది.
 
ప్రస్తుతానికి,35% షూటింగ్ పూర్తయింది, గూస్‌బంప్‌లను అందించిన గ్లింప్స్ ఈ హై-బడ్జెట్ పాన్-ఇండియా చిత్రం నుంచి రాబోయే కంటెంట్ కోసం ఎదురుచూసేలా చేసింది.  హైందవ టైటిల్ గ్లింప్స్ చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ స్టార్ అనే అహం బాలకృష్ణలో కొంచెం కూడా ఉండదు : శ్రద్ధా శ్రీనాథ్