Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిన్న‌ చిరంజీవిపై గీతం ఈరోజు కుటుంబంతో ర‌క్త‌దానం

Webdunia
సోమవారం, 14 జూన్ 2021 (16:07 IST)
Chiru, surekha
మెగాస్టార్ చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌లో భాగంగా బ్లడ్ బ్యాంక్‌, ఐ బ్యాంక్‌తోపాటు ఇటీవల ఆక్సిజన్‌ బ్యాంకులను ఏర్పాటు చేసి మరోసారి తన సేవాగుణాన్ని చాటుకున్నారు. బ్ల‌డ్ బేంక్‌కు చేస్తున్న సేవ‌కు గాను ఆయ‌న కేంద్ర ప్ర‌భుత్వం 2007లో ప‌ద్మ భూష‌ణ్ అవార్డు కూడా ఇచ్చింది. అప్ప‌టినుంచి మ‌రింత‌గా ఆయ‌న సేవ‌లు చేస్తూనే వున్నారు. ఆయ‌న స్పూర్తిగా తీసుకున్న ఆయ‌న అభిమానులు ప్ర‌తి ఏడాది ర‌క్త‌దానం చేస్తూనే వుంటారు. ఆయ‌న పుట్టిన‌రోజున కాకుండా మిగిలిన సంద‌ర్భాల్లోనూ పిల‌వ‌గానే వ‌చ్చి అవ‌స‌ర‌మైన మేర‌కు రోగుల‌కు ర‌క్తాన్ని అందేలా అభిమానులు ముందుకు వ‌స్తారు.
 
అందుకే ఈరోజు మెగాస్టార్ చిరంజీవి, ఆయ‌న భార్య సురేసురేఖ కూడా బ్ల‌డ్  బేంక్ కు వ‌చ్చి ర‌క్తదానం చేశారు. ఈ ఫొటోల‌ను ఆయ‌న త‌న సోష‌ల్‌మీడియాలో పంచుకున్నారు. మెగాస్టార్ చెప్ప‌డ‌మే కాదు. చేసి చూపిస్తున్నారంటూ కితాబిస్తున్నారు. క‌రోనా స‌మ‌యంలో ఎంతోమంది రోగుల‌కు ఇలాంటి ర‌క్త‌దానాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని చిరంజీవి పేర్కొంటున్నారు.
 
ఇదిలా వుండ‌గా, మెగాస్టార్‌ చిరంజీవి. ఆయన చేస్తున్న సేవలను కొనియాడుతూ సంగీత దర్శకుడు, గాయకుడు చరణ్‌ అర్జున్‌ ఓ ప్రత్యేక గీతాన్ని ఆదివారంనాడు రూపొందించారు. ‘ఎవరన్నారు నువ్వు చిరంజీవని.. ఇప్పుడు నువ్వే మా సంజీవని’ అంటూ సాగే ఈ పాటను చరణ్‌ అర్జున్‌, నాగదుర్గ ఆలపించారు. ప్రముఖ దర్శకుడు మెహర్‌ రమేష్ ఈ పాటను ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. గెలిచే ప్రతి వాడికి స్పూర్తి నీ కథ. అంతకు మించింకో సాయమున్నదా.. జై చిరంజీవ జైజై చిరంజీవా.. సేవకు ఎపుడో చూపావు నువ్వు తోవ అంటూ “చరణ్ అర్జున్’’ స్వర పరచి ,రచించి ,గానం చేశారు ,ప్రతి అభిమాని గుండె చప్పుడు ఈ పాట.. మెగా సాయం స్పూర్తి గానం’’ అంటూ మెహర్ రమేష్ పేర్కొన్నారు.
 
ఇప్పటివరకూ మెగాస్టార్ చిరంజీవి తన జీవితంలో ఎదుర్కొన్న ఎత్తుపల్లాల గురించి ఈ పాట ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఈ పాట ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. ఈ పాటపై రచయిత, నిర్మాత కోన వెంకట్ కూడా ట్వీట్ చేశారు.  డైరెక్టర్ వీఎన్ ఆదిత్య ఫేస్‌బుక్ ద్వారా స్పందిస్తూ ‘మెగాస్టార్ సోషల్ సర్వీస్ ఎంత హృదయానికి హత్తుకుందో, ఈ పాట కూడా అంతే అని పోస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుంటానంటూ భర్తకు సవాల్, మనస్తాపంతో భర్త ఆత్మహత్య

హష్ మనీ కేసు.. డొనాల్డ్ ట్రంప్ దోషే.. కానీ శిక్ష లేదు.. నేర చరిత్రతో పదవిలోకి?

ఫిబ్రవరి 10 నుండి 11 వరకు ఫ్రాన్స్‌లో ఏఐ సదస్సు.. హాజరు కానున్న ప్రధాని

రిఫ్రిజిరేటర్‌లో మహిళ మృతదేహం.. చీర కట్టుకుని, ఆభరణాలు ధరించి, మెడకు ఉచ్చు..

Sankranthi: సంక్రాంతి రద్దీ.. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments