సోనూసూద్ ఈ పేరు సినిమాల్లో విలన్‌గా అందరికీ తెలుసు. కానీ బయట మాత్రం గొప్ప మానవతావాది. కరోనా సమయంలో ఆయన అసలు వ్యక్తిత్వం బయటపడింది. ఎన్నో సహాయసహకారాలు అందించారు దేశ ప్రజలకు. ఆయన్ను స్పూర్తిగా తీసుకుని చాలామంది కరోనా కాలంలో ఆక్సిజన్ల బేంక్‌లు కూడా పెట్టారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరన్ ఆధ్వర్యంలో కరోనా బారిని పడినవారికి రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో సేవ చేస్తున్నారు. దీనిపై సోనూసూద్ ఈ విధంగా స్పందించారు.
చిరంజీవి, రామ్‌చరణ్ నిర్ణయం ఎంతో గొప్పది. స్పూర్తిదాయకం. ఇలా మిగిలిన సెలబ్రిటీలు కూడా ముందుకు రావాలి. ప్రభుత్వం ఏదో చేస్తంది అనుకాకుండా మనమే ముందుకు రావాలి అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సోనూసూద్ `ఆచార్య` సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా ఇంకా షూటింగ్ ముగింపు దశలోనే వుంది.
సోనూసూద్ విలన్ పాత్రపై మెగాస్టార్ స్పందించారు. ఈ విషయాన్ని సోనూసూద్ చెప్పారు. ఇప్పటి ఇమేజ్‌కు తగినట్లుగా సోనూసూద్‌ను అభిమానులు విలన్‌గా చూడలేరు. కథ ప్రకారం సన్నివేశాల్లో ఆయన్ను కొడితే ప్రేక్షకులకు నచ్చదు. కాబట్టి సోనూసూద్ కేవలం పాత్ర పోషించాడు. అందుకే నటుడిగానే చూడండి అంటూ డిస్‌క్లయిమర్ వేయాలని మెగాస్టార్ అన్నట్లు సోనూసూద్ తెలిపారు. బహుశా ఇలా వేయడం సినిమా చరిత్రలో మొట్టమొదటి ప్రయోగంగా చరిత్రలో నిలిచిపోతుందన్నమాట