అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా `పుష్ప`. ఇప్పటికీ పూర్తయిన ఈ సినిమాను కరోనా వల్ల వాయిదా వేశారు. అయితే ఈ క్రమంలో ఒకసారి తీసింది చూస్తే రెండుభాగాలుగా మార్చవచ్చని దర్శకుడు సుకుమార్ ఇచ్చిన సలహాతో ఎట్టకేలకు రెండు భాగాలుగా వస్తున్నట్లు వార్తలు ప్రబలంగా వినిపిస్తున్నాయి. అలాగే ఓ స్పెషల్ సాంగ్‌ను ఇందులో చేయనున్నారని అది త్వరలో సెట్‌పైకి వెళ్ళనుందని తెలుస్తోంది. ఇప్పటికే కరోనా వల్ల లాక్‌డౌన్ కూడా సడలించడంతో షూటింగ్ షురూ చేయడానికి సన్నాహాలు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఏదిఏమైనా కరోనా నిబంధనలమేరకు జాగ్రత్తలతో షూట్ చేయనున్నారు. ఇది అడవి నేపథ్యంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ కథగా తెరకెక్కుతుంది. ఇందులో మరి రాజకీయనాయకులు ప్రమేయం వుంటుంది. అది ఎవరనేది పక్కన పెడితే, ఈ సినిమాలో మరో ఆసక్తికరమైన అంశం ఫిలింనగర్‌లో వినిపిస్తోంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి కన్పించనున్నాడట. ఇది కూడా రెండో బాగంలోనేనే. దాంతో మరింత క్రేజ్ వచ్చింది. చిరంజీవి చిన్న క్యామియో ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తుంది. గతంలో చిరంజీవి సినిమాలో బన్నీకూడా కనిపించాడు. దేవీశ్రీప్రసాద్ బాణీలు సమకూర్చారు. అలాగే ఈసారి బన్నీ సినిమాలో చిరు కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో తగ్గేదెలే.. అనే అల్లు అర్జున్ డైలాగ్‌నుకూడా చివర్లో చిరు తన స్టయిల్‌లో చెప్పనున్నట్లు విశ్వసనీయ సమాచారం.