పప్రంచ పర్యవావరణ దినోత్సవం జూన్ 5. ఈ సందర్భంగా పలువురు తెలుగు కథానాయకులు ఇంటి ఆవరణలో మొక్కలు నాటుతూ అందరికీ ఛాలెంజ్ విసురుతున్నారు. మహేష్‌బాబు తన పెరట్లో ఒక మొక్కను నాటి ప్రతి ఒకరికి పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి మరిన్ని మొక్కలు నాటి ఈ భూమిని వచ్చే తరాలకి మరింత పచ్చదనం అందించాలని తెలిపాడు. అలాగే తన కుటుంబసభ్యులతో కలిసి ఇలా ప్లాంట్‌ను నాటారు. పర్యావరణనాన్ని కాపాడుదాం. మన చుట్టూ ప్రపంచాన్ని పచ్చగా మార్చడానికి ప్రయత్నిద్దాం అంటూ కొటేషన్ ఇచ్చారు.
ఎవరికీ ఎవేర్‌నెస్ లేదు
ఇక అల్లు అర్జున్ కూడా ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒకరు ఒక మొక్కను నాటి తమ ఫోటోస్ సోషల్ మీడియాలో ట్యాగ్ చేసి పెట్టాలని వాటిలో కొన్ని తాను కూడా షేర్ చేస్తానని తెలిపాడు. ఇలా ప్రతి ఒకరం కలిసి మన భూమిని కాపాడుకుందాం అని బన్నీ విన్నవించాడు. అదేవిధంగా పర్యావరణంపై తాను ఇంతకుముందు సమంతతో చేసిన ఓ ప్రోగ్రామ్‌లో మాట్లాడిన చిన్న క్లిప్‌నుకూడా పెట్టాడు.
మోస్ట్ ఇంపార్టెంట్ ఏమింటే, ఎవరికీ ఎవేర్‌నెస్ లేదు. ప్రకృతి, మొక్కలు నాటడం విషయంలో. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వాడేస్తున్నారు. నా బర్త్ డే నాడు కూడా పూలు పంపించేవారు. తర్వాత అవి వాడిపోయేవి. ఎవరు పంపించారో కూడా గుర్తుండదు. కానీ మొక్క ఇస్తే, అది భూమిలో పెడితే చెట్టు అవుతుంది. మనం పెరిగే విషయాలపై ఇన్వెస్ట్ చేయాలి అంటూ ఆ వీడియోలో తెలిపారు.