Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వివాహ‌వ్య‌వ‌స్థ‌పై ఉమ‌గా న‌టిస్తున్న కాజ‌ల్‌

Advertiesment
వివాహ‌వ్య‌వ‌స్థ‌పై ఉమ‌గా న‌టిస్తున్న కాజ‌ల్‌
, శనివారం, 5 జూన్ 2021 (18:25 IST)
Kajal Agarwal
కాజ‌ల్ అగ‌ర్వాల్ పెళ్లి త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమా `ఆచార్య‌`లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా పెళ్లి వ్య‌వ‌స్థ‌లో వున్న ఓ అంశాన్ని క‌థ‌గా తీసుకుని `ఉమ‌` అనే చిత్రంలో ఆమె న‌టిస్తోంది. హిందీలో రూపొందుతోన్న ఈ సినిమాను కాజల్ అగర్వాల్ తన సోషల్ మీడియాలో ప్రకటించారు. స్లైస్ ఆఫ్ లైఫ్ డ్రామాగా తెర‌కెక్క‌నుంది. దీనికి సంబంధించిన ఇత‌ర న‌టీన‌టుల ఎంపిక జ‌ర‌గ‌నుంది. క‌రోనా త‌గ్గాక త‌గు జాగ్ర‌త్త‌ల‌తో ఈ సినిమాను తెర‌కెక్క‌నించ‌నున్నారు.ఈ చిత్రాన్ని అవిషేక్ ఘోష్ (ఎవిఎంఎ మీడియా), మంత్రరాజ్ పాలివాల్ (మిరాజ్ గ్రూప్) నిర్మిస్తుండగా, యాడ్ ఫిల్మ్ మేకర్ తథాగట సింఘ దర్శకత్వం వహించనున్నారు.
 
ఉమ పాత్ర‌కు సంబంధించిన పొటో షూట్‌కూడా జ‌రిగింది. ఈ చిత్రం వివాహ నేపథ్యంతో కూడిన మంచి కుటుంబ క‌థా చిత్రంగా ఆమె పేర్కొంది. అప‌రిచిత వ్య‌క్తి ఉమ జీవితంలో ప్ర‌వేశిస్తే ఆమెకు ఎదురైన అనుభ‌వాలు, స‌వాళ్ళ‌తో ఈ క‌థ వుండ‌బోతుంద‌ట‌. 2018లో బెంగాల్ నాట‌కం `ఉమ‌`ను అప్ప‌ట్లో సినిమాగా తెర‌కెక్కించారు. స్విట్జ‌ర్లాండ్‌కు చెందిన ఓ పాప ఉమ‌. త‌ను కొల‌కొత్తాలోని కాళికా ఉత్స‌వాన్ని చూడాల‌నే కోరిక‌తో ఆ చిత్రం రూపొందింది. అయితే కాజ‌ల్ ఉమ సినిమా వివాహం అయ్యాక ఒక ప్రాంతం నుంచి మ‌రో ప్రాంతానికి రావాల్సి వ‌చ్చిన‌ప్పుడు అక్క‌డ ఆచార‌వ్య‌వ‌హారాలు ప‌ద్ద‌తులు ఏవిధంగా ఆక‌లింపు చేసుకుంటార‌నే దానిపై వుంటుంద‌ని తెలుస్తోంది. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌నున్నాయి. ఈ సినిమాను ఐదు భాష‌ల్లో విడుద‌ల చేసే ఆలోచ‌న‌లో వున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సేవ చేస్తున్న అభిమానుల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపిన రామ్‌చ‌ర‌ణ్‌