Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

`ఆచార్య‌`లో చ‌ర‌ణ్ గెస్ట్ రోల్ కాదంటున్న కొర‌టాల‌

Advertiesment
`ఆచార్య‌`లో చ‌ర‌ణ్ గెస్ట్ రోల్ కాదంటున్న కొర‌టాల‌
, మంగళవారం, 25 మే 2021 (11:59 IST)
Chiru-charan
మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న సినిమా `ఆచార్య‌`. ఈ సినిమాలో షూటింగ్‌లో వుండ‌గా ఒక్కో సంద‌ర్భంలో ఒక్కో వార్త బ‌య‌ట‌కు వ‌చ్చేది. అలా చిరంజీవి కొడుకుగా రామ్‌చ‌ర‌ణ్ ఆచార్య‌లో న‌టిస్తున్నాడ‌ని అనుకున్నారు. ఆ త‌ర్వాత ఓ న‌గ్జ‌లైట్ పాత్ర అది న్యూస్ వ‌చ్చింది. మ‌రోవైపు రామ్ చ‌ర‌ణ్ గెస్ట్ రోల్ చేస్తున్నాడ‌ని మ‌రోసారి సోష‌ల్‌మీడియాలో వ‌చ్చింది. ఇలా వుండ‌గానే చిరంజీవితో రామ్‌చ‌రణ్ క‌లిసి తుపాకి ప‌ట్టుకుని న‌డుస్తున్న స్టిల్ కూడా వ‌చ్చింది. ఇప్పుడు క‌రోనా క‌నుక షూటింగ్ కొంత వ‌ర్క్ ఆగిపోయింది.
 
తాజాగా ఈ సినిమాలోని చ‌ర‌ణ్ పాత్ర‌పై ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ క్లారిటీ ఇచ్చాడు. రామ్‌చ‌ర‌ణ్ సిద్ధ అనే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో క‌నిస్తాడు. పాత్ర నిడివి అర‌గంట వుంటుంది. అయినా ప్రాధాన్య‌త వుంటుంది. కీల‌క స‌న్నివేశాల‌కు చ‌ర‌ణ్ పాత్ర ముడిప‌డి వుంది. సినిమా ద్వితీయార్థంలో చ‌ర‌ణ్ పాత్ర క‌నిపిస్తూనే వుంటుంది. అయితే ఇందులో వారిద్ద‌రు తండ్రీ కొడుకులుగా న‌టించ‌లేదు. అంత‌కుమించిన అనుబంధం అంటూ వివ‌రించారు. చ‌ర‌ణ్ ప‌క్క‌న పూజా హెగ్డే న‌టిస్తుంది. మ‌ణిశ‌ర్మ సంగీతం స‌మ‌కూర్చిన ఈ సినిమాను కొణిద‌ల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మేట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ క‌లిసి నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ఎప్ప‌డు విడుద‌ల‌వుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శంకర్- చెర్రీ సినిమా.. రేసులో కైరా, అలియా భట్!