కథానాయికలకు టాలీవుడ్ లో కొరత వుందనేది తెలిసిందే. అందుకే బాలీవుడ్, కోలీవుడ్ నుంచి దిగుమతి చేస్తుంటారు హీరోలు. ఇప్పుడు హద్దులు దాటి విదేశాలపై పడింది. ఇంతకుముందు కత్రినా కైఫ్, అమీజాక్సన్‌లు కూడా ఆ కోవలోనివారే. అమీజాక్సన్‌ను మొదట పరిచయం చేసింది తమిళ దర్శకుడు శంకర్. ఐ సినిమా ద్వారా ఆమెను దక్షిణాదికి పరిచయం చేశాడు. ఇప్పుడు మరో ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. కొరియన్ సినిమాల్లో టాప్ హీరోయిన్ అయిన బే సుజిని దక్షిణాదికి పరిచయం చేబోతున్నాడు. రామ్‌చరణ్‌తో శంకర్ తీయబోయే సినిమాలో కథానాయికగా ఆమెనే అని తెలుస్తోంది. ఆమధ్య ఇండియా వచ్చిన బే సుజి భారతీయ సినిమాలో నటించాలనే కోరికను వ్యక్తం చేసింది. ఇప్పుడు ఆ సినిమా శంకర్ దేనని అర్థమవుతుంది. త్వరలో ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి.
ఇదిలా వుండగా, నాగశౌర్య సరసన మరో విదేశీ నటి నటించనుంది. న్యూయార్క్‌కు చెందిన షిర్లీ సెటియా పేరు పరిశీలనలో వుంది. ఇటీవలే నాగశౌర్య విదేశీనటిని ఎంపిక చేయనున్నామని సూచన ప్రాయంగా వెల్లడించారు. ఇక షిర్లీ సెటియా గాయని కూడా. పుట్టింది కేంద్రపాలిత ప్రాంతమైన డయ్యుడమన్‌లోనే. పెరిగింది న్యూయార్క్‌లో. ఇటీవలే తన సోషల్ మీడియాలో కరోనా గురించి జాగ్రత్తలు చెబుతూ, కోవిడ్ పాజిటివ్ ఉన్న వారందరికీ, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదు. వారిని కుటుంబసభ్యులు, స్నేహితులు మనో ధైర్యాన్ని ఇవ్వాలని పోస్ట్ చేసింది. ఈమె బాలీవుడ్‌లో `5 వెడ్డింగ్స్` నుంచి నెట్‌ప్లిక్ `మస్కా`వరకు నాలుగు సినిమాల్లో నటించింది.