Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మ‌త సామ‌ర‌స్యం పాటిస్తూ శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ముఖులు

మ‌త సామ‌ర‌స్యం పాటిస్తూ శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ముఖులు
, శుక్రవారం, 14 మే 2021 (13:42 IST)
balakrishna, pawan
ఈరోజు రంజాన్ పండుగ‌ను ముస్లింలు జ‌రుపుకుంటున్నారు. అందుకే వారికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు హిందూ ప్ర‌ముఖులు. హిందూవుల పండుగ‌కు ముస్లిం ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు చెప్పిన ఘ‌ట‌న‌లు పెద్ద‌గా వుండ‌వ‌నే చెప్పాలి. ఇదిలా వుండ‌గా, రంజాన్ సంద‌ర్భంగా ముస్లిం వ‌స్త్రధార‌ణ‌తో నంద‌మూరి బాల‌కృష్ణ వారికి శుభాకాంక్ష‌లు తెలుపుతూ వీడియోను కూడా పోస్ట్ చేశాడు. మ‌హేష్‌బాబు, రామ్‌చ‌ర‌న్‌, ఎన్‌టి.ఆర్‌. ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, చిరంజీవి ఇలా అంద‌రూ త‌మ వంతు బాధ్య‌త‌గా వారికి శుభాకాంక్ష‌లు తెలుపుతూ మ‌త సామ‌ర‌స్యానికి ఎలుగెత్తి చాటారు. 
 
బాల‌కృష్ణ ఏమ‌న్నారంటే, 
ముస్లిం సోదరసోదరీమణులకు రంజాన్ పవిత్ర పర్వదిన శుభాకాంక్షలు. త్యాగానికి, సేవా నిరతి కి మారు పేరు రంజాన్ పవిత్ర మాసం. ఎంతో భక్తి శ్రద్ధలతో కఠిన ఉపవాస దీక్ష ఉంటూ దైవాన్ని కొలవడం ఆదర్శప్రాయం. అల్లా కృపాకటాక్షలతో  ఈ రంజాన్ పర్వదినం మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని అందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని సమస్త మానవాళి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ నా రంజాన్ శుభాకంక్షలు తెలియచేసుకుంటూ, మీ బాలకృష్ణ. అని పేర్కొన్నారు.
 
webdunia
anasuya, charan
- ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా గ‌తంలో తాను ద‌ర్గాకు వెళ్ళిన సంద‌ర్భంగా పొటోను పోస్ట్‌చేసి, ముందుగా ముస్లిం సోదరులకు సోదరిమణీలకు జనసేన పార్టీ తరపున రంజాన్ మాసం శుభాకాంక్షలు.
 
- రామ్‌చ‌ర‌ణ్ కూడా టోపీ ధ‌రించి, ముస్లిం సోదర, సోదరీమణులందరికి పవిత్ర రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.

webdunia
Samantha burakha
- స‌మంత అక్కినేని అయితే ఏకంగా బుర‌ఖా వేసుకుని ర‌క‌ర‌కాల గెట‌ప్‌లో రంజాన్ శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది. 
- ఇక వీరితోపాటు యాంక‌ర్‌, న‌టి, డాన్స‌ర్ అన‌సూయ‌కూడా త‌గిన వ‌స్త్రధార‌ణ‌తో ఇంటిలోనే వుంటూ ఈద్ పండుగ‌ను బాగా జ‌రుపుకోండి. సేఫ్ లైఫ్ అంటూ శుభాకాంక్ష‌లు తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెను ప్రమాదం నుంచి కోవిడ్ రోగులను రక్షించిన సోనూసూద్ బృందం