Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ తల్లికాబోతున్న బుల్లితెర యాంకర్.... అనసూయనా? లాస్యనా?

Webdunia
బుధవారం, 21 సెప్టెంబరు 2022 (15:00 IST)
బుల్లితెరపై అనసూయ, శ్రీముఖి, రష్మీ గౌతమ్, లాస్య, సుమ వంటి వారు యాంకర్లుగా రాణిస్తున్నారు. వీరిలో పలువురుకి వివాహమైంది. ముఖ్యంగా, సుమ, అనసూయ వంటి వారికి వివాహమై పిల్లలు కూడా ఉన్నారు. రష్మీ గౌతమ్, శ్రీముఖికి ఇంకా పెళ్ళికాలేదు. కానీ మరో యాంకర్ లాస్య మాత్రం ఇప్పటికే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఇపుడు మరోమారు తల్లికాబోతుంది. ఈ విషయాన్ని లాస్య దంపతులు స్వయంగా ప్రకటించారు. తాము మరోమారు పేరెంట్స్ అవుతున్నామని చెప్పారు. దీంతో లాస్య దంపతులకు అనేక మంది శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
 
బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో పాల్గొన్న లాస్య కొన్నేళ్ళ క్రితం మంజునాథ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి జున్ను అనే కుమారుడు ఉన్నాడు. తాజాగా లాస్య సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ఇందులో తాము మరోమారు పేరెంట్స్ అవుతున్నామని తెలిపింది. తాను గర్భవతిని అని ఆమె వెల్లడించింది. తమ కుటుంబం మరో రెండు అడుగులు ముందుకు వేస్తోందని తెలిపింది. ఈ విషయం తెలియగానే పలువురు ఆమెకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ram Gopal Varma: వ్యూహం స్ట్రీమింగ్.. ఆర్జీవీకి ఏపీ ఫైబర్ నెట్ నోటీసులు

Chaganti Koteshwara Rao : ఏపీ విద్యార్థుల కోసం నీతి పుస్తకాలు పంపిణీ

పుష్ప 2 చూసి యువకులు చెడిపోతున్నారు, రేవతి భర్తకు 25 లక్షల చెక్కు: మంత్రి కోమటిరెడ్డి

Pawan Kalyan: ఓట్ల కోసం పనిచేయట్లేదు- ప్రజా సంక్షేమమే లక్ష్యం.. పవన్ కల్యాణ్

BRS : స్విస్ బ్యాంకుకే బీఆర్ఎస్ రుణాలు ఇవ్వగలదు.. రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments