పిల్లల విషయంలో తల్లిదండ్రులు కొన్ని విషయాలు నేర్చుకోవాలి. పెద్దవాళ్లుగా మీరు చెప్పిందల్లా పిల్లలు వినాలని కోరుకోకూడదు. చిన్నారులు చెప్పే విషయాలను కూడా పెద్దలు ఆసక్తిగా వినాలి. అప్పుడే వారు మనసులోని భావాలను స్వేచ్ఛగా మీతో పంచుగోగలుగుతారు. అలా పారెంట్స్ కిడ్స్ మధ్య అనుబంధం బలపడుతుంది.
ప్రేమంటే పిల్లలకు కావాలసిన వస్తువులను అప్పటికప్పుడు సమకూర్చడం కాదు. చిన్నారులను ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవడం.. మనసు విప్పి మాట్లాడటం.. మీకు నేనున్నాననే భరోసా కల్పించడం.. ఇలా తల్లిదండ్రులు చూపించే అంతులేని ప్రేమాభిమానాలు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.
పెద్దలు పిల్లల పట్ల సానుకూలంగా స్పందించే అది చిన్నారులకూ అలవాటు అవుతుంది. క్లిష్ట పరిస్థితులను సవాలుగా తీసుకుని ధైర్యంగా ముందడుగు వేస్తే పిల్లలు కూడా అదే బాటలో పయనిస్తారు. ముఖ్యంగా పెద్దలు పోషకాహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే వాళ్లూ మెల్లగా అవే నేర్చుకుంటారు.