అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న చిత్రం "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. టాలెంటెడ్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో రెడీ అవుతున్న ఈ సినిమాను టాలీవుడ్లో వరుసగా భలేభలే మగాడివోయ్, పిల్లానువ్వులేని జీవితం, గీతగోవిందం, ప్రతిరోజు పండగే లాంటి బ్లాక్‌బస్టర్స్‌తో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్‌గా క్రేజ్‌ని సొంతం చేసుకున్న బన్నీ వాసు, మరో నిర్మాత ప్రముఖ దర్శకుడు వాసు వర్మతో కలిసి నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో అఖిల్ అక్కినేని సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది.
"మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్" సినిమా అనౌన్స్ దగ్గర నుంచి అక్కినేని అభిమానుల్లో ఫుల్ క్రేజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ టీం విడుదల చేసిన అఖిల్ అక్కినేని ఫస్ట్‌లుక్‌కు, అలానే గోపిసుందర్ సంగీత సారథ్యంలో హ్యాపెనింగ్ స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన మనసా మనసా పాటకు, ఆ తరువాత విడుదల చేసిన టీజర్‌కు అటు సోషల్ మీడియాలో ఇటు అభిమానుల్లో అనూహ్యమైన స్పందన లభించడం యూనిట్లో కొత్త ఉత్సాహన్ని తెచ్చింది.
ఇదే ఉత్సాహంతో అక్కినేని అభిమానులకు స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తూ యూనిట్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సంక్రాంతి పోస్టర్ని విడుదల చేశారు. ఈ పోస్టర్లో అఖిల్ - పూజా మధ్య కెమిస్ట్రీ కనువిందుగా ఉంది. అలానే అఖిల్ అక్కినేని మ్యాన్లీ లుక్ అల్ట్రా స్టైలిష్‌గా ఉంది.
దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తన చిత్రాల్లోని పాత్రల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో లవ్ లీగా వుండే కేరక్టర్స్గా డిజైన్ చేస్తారు. అందుకే ఆయన చిత్రాలకి ఓ స్పెషాలిటి వుంటుంది. అఖిల్ అక్కినేని, పూజాల మద్య ఎలాంటి కెమిస్ట్రి ఈ చిత్రంలో వుండబోతుందో ఈ పోస్టర్ డిజైనింగ్‌లో చాలా చక్కగా, అందంగా చూపించారు దర్శకుడు భాస్కర్. ఈ సినిమాను వేసవిలో విడుదల చేయడానికి నిర్మాత బన్నీ వాసు సన్నాహాలు చేస్తున్నారు