స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ రికార్డు క్రియేట్ చేసిన ఏడాది పూర్తి కావస్తుంది. ఈ సినిమా కరోనా కాలంలోనూ క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. తెలుగు సినిమా పరంగా ఈ సినిమా బన్నీ అభిమానులనే కాదు.. తెలుగు ప్రేక్షకులను కూడా మెస్మరైజ్ చేసింది. గత ఏడాది సంక్రాంతికి వచ్చిన అల వైకుంఠపురములో బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది.
జనవరి 12, 2020న విడుదలైన ఈ చిత్రం.. రూ.260 కోట్లను వసూలు చేసి నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేసి బన్నీ స్టామినాను బాక్సాఫీస్ వద్ద చాటింది. ఈ సినిమాను విడుదలై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ సెలబ్రేషన్స్‌ను చేయాలని భావిస్తున్నారట. ఈ సెలబ్రేషన్స్‌ను ఎలా చేయాలి? ఏం చేయాలి? అని ఆలోచిస్తున్నారట నిర్మాతలు.
త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది. 'అల వైకుంఠపురములో సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ కావడానికంటే ముందే.. పాటలు సెన్సేషనల్ హిట్ అయ్యాయి. రాములో రాముల... , సామజవరగమన, బుట్టబొమ్మ... సాంగ్స్ ఆడియో పరంగా వందేసి మిలియన్స్ క్రాస్ చేసి రికార్డులు క్రియేట్ చేశాయి. ఇక వీడియో సాంగ్స్ హవా కూడా అదే రేంజ్‌లో సాగింది. ముఖ్యంగా బుట్టబొమ్మ సాంగ్‌కు వార్నర్, శిల్పాశెట్టి వంటి క్రికెటర్స్, బాలీవుడ్ తారలు స్టెప్పులు కూడా వేశారు.
కాగా ఈ సినిమాలో బుట్టబొమ్మ పాట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సామాజిక మాధ్యమాల్లోనూ, కవర్ సాంగ్స్‌లోనూ బాగా ట్రెండ్ అయిన సాంగ్ 'బుట్టబొమ్మ'. ప్రస్తుతం ఆ పాట యూట్యూబ్ వీక్షణల్లో 500 మిలియన్ క్లబ్‌లోకి చేరుకుంది. అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అలవైంకుఠపురములో' చిత్రంలోని పాటలన్నీ హిట్టే. తమన్ స్వరాలు కూర్చిన ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ యాభై కోట్ల వీక్షణల క్లబ్బులోకి చేరడంతో బన్నీ ఫ్యాన్స్ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.