Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స‌క్సెస్‌మీట్‌లో అన్నీ మాట్లాడ‌తా... శ్రుతి హాస‌న్‌ అప్పుడు వ‌స్తుంది... రవితేజ

స‌క్సెస్‌మీట్‌లో అన్నీ మాట్లాడ‌తా... శ్రుతి హాస‌న్‌ అప్పుడు వ‌స్తుంది... రవితేజ
, గురువారం, 7 జనవరి 2021 (16:52 IST)
రవితేజ హీరోగా గ్లామర్ స్టార్ శృతిహాసన్ హీరోయిన్‌గా సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ పతాకంపై గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బి. మధు నిర్మించిన చిత్రం "క్రాక్". డాన్ శ్రీను, బలుపు చిత్రాల తర్వాత రవితేజ-గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగానే "క్రాక్" చిత్రాన్ని రూపొందించారు. రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. థమన్.యస్ అందించిన మ్యూజిక్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. లహరి మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది. 
 
కాగా ఈ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 6న హైదరాబాద్ పార్క్ హయత్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, నిర్మాతలు బోగవల్లి ప్రసాద్, యం. యల్.కుమార్ చౌదరి, కె.ఎల్. దామోదర ప్రసాద్, నటులు ఆలీ, సముద్రఖని, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, జోష్ రవి, సుధాకర్, వంశీ, కత్తి మహేష్, ముక్కు అవినాష్, నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా, గేయ రచయిత కాసర్ల శ్యామ్, ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్, స్టంట్ శివ తదితరులు పాల్గొన్నారు. జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్స్‌లో రిలీజ్ కానున్న ఈ చిత్రం మొదటి, రెండవ టికెట్స్‌ను వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి కొనుగులు చేశారు.
 
మాస్ మహారాజ్ రవితేజ మాట్లాడుతూ, ' హిట్, ప్లాప్‌లకు సంభందం లేకుండా థమన్ నాకు ఎప్పుడూ మంచి మ్యూజిక్ ఇస్తాడు. అలాగే ఈ చిత్రానికి ఎక్స్‌ట్రార్డినరి మ్యూజిక్ చేసాడు. రామజోగయ్య శాస్త్రి మూడు పాటలు రాయగా, కాసర్ల శ్యామ్ ఒక సాంగ్ రాసాడు. పాటలకు బ్రహ్మాండమైన ఫీడ్ బ్యాక్ వస్తుంది. నాకు బాగా ఇష్టమైన సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ 'శంభో శివ శంభో' ఒకటి. సముద్రఖని మంచి రైటర్.. దర్శకుడు. ఈ చిత్రంలో ఆయన విలన్ క్యారెక్టర్ చేశారు. బుర్రా సాయి మాధవ్ మంచి పవర్ ఫుల్ డైలాగ్స్ రాశారు. ఆయనతో వర్క్ చేయడం ఫస్ట్ టైమ్. తెరవెనుక హీరోలు జి.కె. విష్ణు కెమెరా విజువల్స్ బ్యూటిఫుల్‌గా ఇచ్చాడు. లైటింగ్, ఫ్రేమ్స్ పెట్టె విధానం చాలా బాగుంది. ఆయనతో వర్క్ చేయడం వెరీ హ్యాపీ. ముందు ముందు ఇంకా ఆయనతో వర్క్ చెయ్యలనుకుంటున్నాను. రామ్ లక్ష్మణ్‌లు నా సినిమాలకి ఎప్పుడూ ఫైట్స్ బాగా కంపోజ్ చేస్తారు. సినిమా సినిమాకి వాళ్ళు బాగా ఎదుగుతూ అప్డేటెడ్‌గా వుంటారు. వందశాతం పొజిటివ్‌నెస్‌తో వుంటారు. శృతిహాసన్‌తో ఇది రెండవ సినిమా. తను చాలా చాలా బాగా చేసింది.  ఆలీతో చేసిన అన్నీ సినిమాలు మంచి హిట్ అయ్యాయి. మళ్ళీ ఈ చిత్రంలో ఒక మంచి పాత్రలో నటించారు. గోపీచంద్ మలినేని చాలా కష్టపడి ఈ సినిమా తీశాడు. సక్సెస్ మీట్‌లో కలుద్దాం అని చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాడు. మా ఇద్దరి కాఅంబినేషన్‌లో వస్తున్న "క్రాక్" హ్యాట్రిక్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మధు, అమ్మిరాజులకు ఈ చిత్రం పెద్ద హిట్ అయి బాగా డబ్బులు తెచ్చిపెట్టాలి అన్నారు.
 
తెలుగు సినిమాని బ్రతికించాలి!! 
ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ, 'భద్ర సినిమాకి అసోసియేట్‌గా వర్క్ చేశాను. అప్పటినుండి రవితేజతో పరిచయం. ఇండస్ట్రీకి మళ్ళీ మంచి రోజులు వచ్చాయి అని చెప్పడానికి క్రాక్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఒక కారణం. తెలుగు సినిమాని ప్రేక్షకులు బ్రతికించాలి. ప్రతీ సినిమా థియేటర్స్‌లో చూసి మంచి రెవిన్యూస్ ఇవ్వాలి. గోపిచంద్‌కి ఈ చిత్రం మంచి హిట్ అవ్వాలి. అలాగే ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతిఒక్కరికీ మంచి పేరు రావాలి.. అన్నారు.
 
ఆయన ఒక ఫైర్ బ్రాండ్ లాంటోడు!! 
హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ, ' తొమ్మిది నెలలుగా ఇంట్లోనే ఉన్నాం. ఈ ఫంక్షన్ చూస్తుంటే ఒక కిక్ వచ్చినట్టు అనిపిస్తుంది. గత ఏడాది సంక్రాంతికి కాసుల వర్షం కురిసింది. ఈ సంక్రాంతికి క్రాక్‌తో అదే రేంజ్‌లో థియేటర్స్ దద్దరిల్లేలా ఆడియెన్స్ రెవిన్యూ ఇచ్చి ముందు రాబోయే సినిమాలకి ధైర్యాన్ని ఇవ్వాలి. రవితేజ.. రవి అంటే సన్. సన్ అంటే ఫైర్. వెలుగుతూనే ఉంటాడు. దర్శకులు ఆ ఫైర్‌ని ఎంత వాడుకోవలో అంత వాడుకోవచ్చు. ఎవరైతే ఆయన్ని కరెక్టుగా వాడుకుంటారో ఆ సినిమా బ్లాస్ట్ అవుతుంది. సముద్రఖని మంచి దర్శకుడు. ఆయనంటే చాలా ఇష్టం. నటుడిగా పలు వెరీయేషన్స్ ఉన్న పాత్రలని చూజ్ చేసుకుంటున్నారు. ఈ సినిమా డెఫినెట్‌గా షూర్ షాట్ హిట్.. గోపి హ్యాపీగా తడి గుద్ద ఏసుకొని పడుకోవచ్చు. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.
webdunia
 
నా కెరీయర్ లో మైల్ స్టోన్ చిత్రం!! 
దర్శకుడు, నటుడు సముద్రఖని మాట్లాడుతూ, 'నా కెరీయర్లోనే పెద్ద మైల్ స్టోన్ స్క్రిప్ట్ ఇది. గోపి సూపర్బ్‌గా కథ తయారు చేశాడు. కటారి కృష్ణగా నా క్యారెక్టర్ గొప్పగా డిజైన్ చేశాడు. అమ్మిరాజు మధు ఎంతో క్వాలిటీగా ఈ చిత్రాన్ని నిర్మించారు. విష్ణు కెమెరా విజువల్స్ అమేజింగ్. పదకొండు సంవత్సరాల తర్వాత రవితేజతో యాక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది.. అన్నారు.
 
ఇక నుండి మాది బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కానుంది!! 
చిత్ర దర్శకుడు గోపిచంద్ మలినేని మాట్లాడుతూ, 'జనవరి 9న మా క్రాక్ రిలీజ్ కాబోతుంది. సంక్రాంతి పండక్కి ముందే మాకు పెద్ద పండక రానుంది. నాకు సినిమా జీవితాన్ని ఇచ్చిన రవితేజకి నా కృతజ్ఞతలు. ఆయన నాకు ఒక బ్రదర్‌లా తోడుంటాడు. డాన్ శ్రీను, బలుపు చిత్రాల తర్వాత మా ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ క్రాక్ చిత్రం షూర్ షాట్ హ్యాట్రిక్ అవుతుంది. ప్రేక్షకులు, అభిమానులు రవితేజ నుండి ఏం కోరుకుంటారో అవన్నీ ఈ చిత్రంలో ఉంటాయి. మాది సూపర్ హిట్ కాంబినేషన్. క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కాబోతుంది. నేను పుట్టి పెరిగిన ఒంగోలు బాక్డ్రాప్‌లో ఈ చిత్రాన్ని తీశాం. నిజ జీవిత వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. రామ్-లక్ష్మణ్, థమన్, జికె విష్ణు, సాయి మాధవ్ బుర్రా, అందరం కలిసి ఒక టీమ్ వర్క్‌లా చేశాం. మధుగారు అమ్మిరాజు ఏది కావాలన్నా కాంప్రమైజ్ కాకుండా ప్రొవైడ్ చేసి అత్యద్భుతంగా ఈ చిత్రాన్ని నిర్మించారు అన్నారు.
 
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అమ్మిరాజు మాట్లాడుతూ, 'సంక్రాంతి కానుకగా జనవరి 9న మా క్రాక్ చిత్రం భారీగా విడుదలవుతుంది. పండక్కి ముందే మాకు పెద్ద పండగ వస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన మధు, రవితేజ, గోపిచంద్ గారికి థాంక్స్ అన్నారు.
 
ప్రముఖ నిర్మాత బోగవల్లి ప్రసాద్ మాట్లాడుతూ, క్రాక్ ట్రైలర్ అదిరిపోయింది. ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అన్నారు.
 
యం. యల్. కుమార్ చౌదరి మాట్లాడుతూ, నేను రవితేజతో ఇడియట్, విక్రమార్కుడు, రెండు సినిమాలు తీశాను. అవి చాలా పెద్ద హిట్ అయ్యాయి. నాకు రవితేజతో విక్రమార్కుడు-2 చెయ్యాలని ఉంది. కానీ ఈ క్రాక్ ట్రైలర్ చూశాక విక్రమార్కుడు సీక్వెల్ లాగా అనిపించింది. నా మిత్రులు అమ్మిరాజు, మధు నిర్మించిన ఈ క్రాక్ చిత్రం కలకాలం గుర్తుండిపోయే సినిమాలా బ్లాక్ బస్టర్ అవ్వాలని, అవుతుందని ఆశిస్తున్నాను. 
 
నిర్మాతల మండలి కార్యదర్శి కె.ఎల్. దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ, సంక్రాంతి అంటే పెద్ద పండగ. ఆ పండక్కి వస్తున్న క్రాక్ సినిమాని ప్రేక్షకులు, అభిమానులు పెద్ద హిట్ చేసి తెలుగు సినిమాని ఇష్టపడే తెలుగు ప్రేక్షకులు మరొక్కసారి ప్రూవ్ చేసుకోవాలి. మిత్రులు మధు, రవితేజ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం అందర్నీ అలరిస్తుందనే నమ్మకం ఉంది.. అన్నారు.
 
మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ, 'మా ఆవిడ తొమ్మిదినెలలు గర్భంతో వున్నప్పుడు కూడా ప్రక్క థియేటర్ లో సినిమాకి వెళ్ళాను.  సినిమా అంటే అంత పిచ్చి నాకు. రవితేజ లాంటి ఫుల్ ఎనర్జిటిక్ హీరోకు ఎప్పటినుండో రాయలనుకొని ఎదురు చూస్తున్న నాకు గోపి పిలిచి ఈ సినిమా కి రాసే ఛాన్స్ ఇచ్చాడు. అద్భుతమైన కథ చెప్పాడు గోపి. రాసేటప్పుడే ఎంజాయ్ చేస్తూ.. కచ్చితంగా సూపర్ హిట్ ఫిల్మ్ కి రాస్తున్నాం అనుకున్నాం.  సినిమా చూశాక చాలా హ్యాపీగా ఫీలయ్యాం. ప్రతి క్యారెక్టర్ ని గోపి అద్భుతంగా డిజైన్ చేశాడు. రవితేజ ఇరగదీశారు అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

7 భాషల్లో విడుదల కానున్న ‘రెడ్’