Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాలుగో పెళ్లికి సిద్ధమైన వనితా విజయకుమార్... రజనీ - చిరంజీవికి లింకు...(Video)

Advertiesment
నాలుగో పెళ్లికి సిద్ధమైన వనితా విజయకుమార్... రజనీ - చిరంజీవికి లింకు...(Video)
, బుధవారం, 6 జనవరి 2021 (08:54 IST)
తమిళ నటుడు విజయ కుమార్ కుమార్తె వనితా విజయ కుమార్. ఇటీవలి కాలంలో బాగా వార్తల్లో నిలుస్తున్న నటి. దీనికి కారణం.. ఆమె ఇప్పటికే మూడే వివాహాలు చేసుకుంది. కానీ మూడో పెళ్లి మూణ్ణాళ్ళ ముచ్చటగానే మారింది. మూడో భర్తను వదిలిపెట్టింది. ఇపుడు నాలుగో పెళ్లికి సిద్ధమవుతోంది. 
 
దీనిపై వనితా విజయకుమార్ స్పందిస్తూ, మూడో పెళ్లి విషయంలో రాంగ్‌ డెసిషన్‌ తీసుకున్నట్టు చెప్పింది. పెళ్లి చేసుకున్న 10 రోజుల్లోనే మూడో భర్తను కాదనడానికి అనేక కారణాలు ఉన్నాయన్నారు. ఇపుడు నాలుగో పెళ్లికి సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
 
ఈ పెళ్లిగోల పక్కనబెడితే... తన పెళ్లిళ్ల విషయాన్ని సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌, మెగాస్టార్‌ చిరంజీవిలకు లింక్‌ పెడుతూ.. ఆమె వ్యక్తం చేసిన ఆవేదన ఇప్పుడందరినీ ఆలోచించేలా చేస్తుంది. 
 
'రజనీకాంత్‌, చిరంజీవి వంటి వారు, వారి కూతుళ్ల సంతోషాన్ని దృష్టిలో పెట్టుకుని మంచివాళ్లను చూసి మళ్లీ పెళ్లి చేశారు. కానీ నా తల్లిదండ్రులు అలా చేయలేదు. చిన్న వయసులోనే నాకు పెళ్లి చేసి.. చేతులు దులిపేసుకున్నారు. నా ఇబ్బందులు వారు అర్థం చేసుకోలేదు. నా భర్తకు, నాకు గొడవలు వచ్చి విడిపోయినా.. పరువు కోసం మళ్లీ నన్ను భర్త దగ్గరకు పంపించేవారు. 
 
ఇలా చాలా సార్లు జరిగింది. రజనీకాంత్‌, చిరంజీవిలా అర్థం చేసుకుని ఉంటే.. ఈరోజు నా లైఫ్‌ మరోలా ఉండేది. చాలా ఇబ్బందులు ఫేస్‌ చేశాను. రీసెంట్‌గా నేను చేసుకున్న పెళ్లి విషయంలో చాలా రాంగ్‌ స్టెప్‌ వేశాను. అది అసలు పెళ్లే కాదు' అని వనితా విజయకుమార్ వాపోయారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంక్రాంతి సంబరాల్లో మా 'క్రాక్' ప్రేక్షకులకు కిరాక్ పార్టీ ఇస్తుంది: మాస్ మ‌హారాజ ర‌వితేజ‌