Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రెండో పెళ్లి చేసుకున్న రాఘవేంద్ర రావు మాజీ కోడలు

Advertiesment
రెండో పెళ్లి చేసుకున్న రాఘవేంద్ర రావు మాజీ కోడలు
, మంగళవారం, 5 జనవరి 2021 (15:53 IST)
టాలీవుడ్ అగ్ర దర్శకుడు కె.రాఘవేంద్ర రావు మాజీ కోడలు కనికా థిల్లాన్ రెండో పెళ్లి చేసుకుంది. బాలీవుడ్ రచయిత హిమాన్షు శర్మతో ఆమె వివాహం జరిగింది. కె.రాఘవేంద్ర రావు కుమారుడు ప్రకాశ్ కోవెలమూడితో సినీ రచయిత కనికా థిల్లాన్‌తో తొలుత వివాహమైంది. కానీ, వారిద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. 
 
ఈ క్రమంలో బాలీవుడ్ ర‌చయిత హిమాన్షు శ‌ర్మతో కొన్నాళ్లుగా ప్రేమ‌లో మునిగి తేలిన క‌నికా గ‌త డిసెంబ‌ర్‌లో అత‌నితో నిశ్చితార్దం జ‌రుపుకుంది. ఇక ఈ రోజు అత‌నిని వివాహం చేసుకున్నారు. చాలా నిరాడంబ‌రంగా జ‌రిగిన ఈ వేడుక‌లో ఇరు కుటుంబాల‌కు చెందిన అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే పాల్గొని నూత‌న వ‌ధూవ‌రుల‌ని ఆశీర్వ‌దించారు.
webdunia
 
పెళ్ళికి సంబంధించిన ఫొటోల‌ను క‌నికా థిల్లాన్ త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ..కొత్త సంవ‌త్స‌రంలో కొత్త ప్ర‌యాణం అని కామెంట్ పెట్టింది.  కనికా థిల్లాన్ గతంల 'జ‌డ్జిమెంట‌ల్ హై క్యా', 'మ‌న్మ‌ర్జియాన్' వంటి సినిమాల‌కు ర‌చ‌యిత‌గా ప‌ని చేసింది. 
 
హిమాన్షు.. త‌ను 'వెడ్స్ మ‌ను', 'రాణీజానా', 'జీరో' చిత్రాల‌కు క‌థ అందించారు. ఇక వీరిద్ద‌రి ప్ర‌స్తుత ప్రాజెక్టుల విష‌యానికి వ‌స్తే హిమాన్షు.. అక్ష‌య్ కుమార్, అత్రాంగీ రేచిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. అలాగే, క‌నికా.. తాప్సీ హ‌సీన్ దిల్‌రూబా, రాజ్‌కుమార్ హిరానీ త‌దుపరి చిత్రంల‌కు ప‌ని చేస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ఓసి నా క్లాస్ కళ్యాణి... పెట్టవే మాస్ బిర్యాని' అంటున్న 'క్రాక్' రవితేజ