వయోబేధం లేకుండా మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఒకవైపు అత్యాచార ఘటనలు.. మరోవైపు దాడులు జరుగుతున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాయవరం ప్రభుత్వ పాఠశాలలో ఓ యువకుడు దుశ్చర్యకు పాల్పడ్డాడు.
టెన్త్ విద్యార్థినికి సత్తిరెడ్డి అనే యువకుడు తాళి కట్టేందుకు యత్నించాడు. అదే గదిలో ఉన్న విద్యార్థిని సోదరుడు అడ్డుపడడంతో తాళి కట్టకుండా సత్తిరెడ్డి పరారయ్యాడు. అనంతరం అక్కడ నుంచి ఇంటికి వచ్చిన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు సత్తిరెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవల రాజమండ్రిలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఇంటర్ స్టూడెంట్స్ కాలేజీలోనే పెళ్లి చేసేసుకున్నారు. ఈ ఘటన మీడియాలో ప్రసారం కావడంతో కాలేజీ యాజమాన్యం చర్య తీసుకుంది.