Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దివ్యాంగురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.. ఒంగోలులో దారుణం

Advertiesment
దివ్యాంగురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.. ఒంగోలులో దారుణం
, శనివారం, 19 డిశెంబరు 2020 (11:38 IST)
మహిళలపై అకృత్యాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో దివ్యాంగురాలి మరణం సంచలనం రేపింది. కొందరు దుండగులు అత్యంత దారుణంగా యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన ఈ ఘటనతో ఒంగోలు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ దారుణ ఘటనపై దర్యాప్తు చేస్తోన్న పోలీసులు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.
 
అసలే చీకటి అందులోనూ నిర్మానుష్య ప్రాంతం ఎందుకు వెళ్లిందో.. ఏం జరిగిందో తెలియదు వీల్ ఛైర్‌లో మంటల్లో దహనమవుతూ కనిపించింది. నిస్సహాయ స్థితిలో ప్రాణాలు విడిచింది. స్థానికులు ఈ విషయాన్ని గమనించేలోపే ఆ యువతి శరీరం అగ్నికి ఆహుతైపోయింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని దశరాజుపల్లిలో చోటుచేసుకుంది.
 
దివ్యాంగురాలన్న కనీస కనికరం లేకుండా యువతిని దారుణంగా హత్యం చేయడం స్థానికులను కలవరపరచింది. పోలీసులకు సమాచారం అందించగా మృతురాలు ఒంగోలులోని 12వ వార్డు వాలంటీర్‌గా చేస్తోన్న భువనేశ్వరిగా గుర్తించారు పోలీసులు.
 
ఇక తనకున్న ఏకైక దిక్కు కూడా దూరమైపోయిందని భువనేశ్వరి తల్లి జానకీ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. తన కూతురిని ఎవరో కావాలనే హత్య చేశారన్నారు. స్థానికంగా కలకలం రేపిన భువనేశ్వరి హత్యపై పోలీసులు వివిధ కోణాల్లో విచారిస్తున్నారు.
 
ఇక వీల్‌ఛైర్‌లోనే మృతదేహం కనిపించడంతో యువతిని ఎవరో హత్య చేశాకే దహనం చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతురాలి కాల్‌ డేటా ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జో బైడెన్ టీమ్‌లో భారత సంతతి వ్యక్తికి చోటు.. అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా..