Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వివాహేతర సంబంధం: ఒంగోలులో భర్తతో కలిసి ప్రియుడిని చంపేసిన భార్య?

Advertiesment
వివాహేతర సంబంధం: ఒంగోలులో భర్తతో కలిసి ప్రియుడిని చంపేసిన భార్య?
, మంగళవారం, 15 డిశెంబరు 2020 (13:07 IST)
ఒంగోలులో పట్టపగలే దారుణం జరిగింది. గంధీ పార్కు వద్ద పట్టపగలే థామస్ అనే యువకుడిని భార్యాభర్తలు పొడిచి చంపేసారు. ఆ తర్వాత పోలీసుల ఎదుట లొంగిపోయారు. హతుడు ఒంగోలులో ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
 
హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కాగా హతుడిని ఓ ప్రణాళిక ప్రకారం పార్కుకి రప్పించి హత్య చేసినట్లు తెలుస్తోంది. హత్య చేసిన నిందితుల్లో మహిళతో థామస్ కి వివాహేతర సంబంధం వుందనీ, ఆ కారణం వల్లనే అతడిని హత్య చేసినట్లు తెలుస్తోంది.
 
గత కొన్ని రోజులుగా థామస్ కి ఈమెకి గొడవలు జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం థామస్ కి ఫోన్ కాల్ రావడంతో అతడు హడావుడిగా పార్కు వైపు వెళ్లాడు. కొన్ని నిమిషాల్లోనే హత్యకు గురయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. ఐదంకెల జీతం అని నమ్మి ఇస్తే.. రమ్యశ్రీని కొట్టి చంపేశారు.. ఎక్కడ?