Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ ముద్రను చెరిపేసిన హీరోను తక్కువ చేసి మాట్లాడిన జిగేల్ రాణి (video)

Advertiesment
Pooja Hegde
, మంగళవారం, 24 నవంబరు 2020 (13:14 IST)
తెలుగు చిత్రపరిశ్రమలోని హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. ఈమె ఇటీవలి కాలంలో పలు వివాదాల్లో చిక్కుకుంటుంది. గతంలో తనకు స్టార్ ఇమేజ్‌ను కల్పించిన టాలీవుడ్ ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడింది. ఇపుడు తనకు లైఫ్ ఇచ్చిన హీరో ఫ్యాన్స్ హర్ట్ అయ్యేలా వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా, ఫ్లాప్ హీరోయిన్ ముద్రను చెరిపేసిన హీరో కాదనీ, మరో హీరోపై పొగడ్తల వర్షం కురిపించింది. దీంతో హీరో అభిమానులు జిగేల్ రాణిపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఆ హీరోలు ఎవరో కాదు.. ఒకరు అల్లు అర్జున్ అయితే, మరొకరు జూనయిర్ ఎన్టీఆర్. ఇందులో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీగా ఉంటే.. బన్నీ ఫ్యాన్స్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు పూజా హెగ్డే చేసిన వ్యాఖ్యలు ఏంటో ఓసారి తెలుసుకుందాం. 
 
పూజా హెగ్డే తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. టాలీవుడ్‌ ప్రేక్షకులను కించపరిచేలా మాట్లాడింది. దీంతో ఆమెపై ఒక్కసారిగా వ్యతిరేకత రావడంతో వెంటనే.. తన టీమ్‌తో ఓ లెటర్‌ని విడుదల చేయించింది. అయితే అంత వివాదం జరిగినా.. ఒక్క ట్వీట్‌ కూడా చేయని పూజా హెగ్డే.. టీమ్‌తో లెటర్‌ విడుదల చేయించిన తర్వాత కూడా స్పందించలేదు. 
 
ఇక మళ్లీ ఆమె అటువంటి వివాదంలోనే చిక్కుకుంది. అదేంటంటే.. రీసెంట్‌గా ఆమె 'అరవింద సమేత' సినిమా గురించి ప్రస్తావిస్తూ.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ని పొగడ్తలతో ముంచేసింది. తారక్‌ తన ఎనర్జీకి మ్యాచ్‌ చేయగలిగే రేంజ్‌లో ఉంటాడని, అతనితో కలిసి నటించడం చాలా గొప్ప అనుభూతిని ఇచ్చిందని చెప్పుకొచ్చింది. 
 
దీంతో.. అసలామె ప్లాప్‌ హీరోయిన్‌గా పడిన ముద్రని చెరిపేసిన అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ హర్టయ్యారు. డీజేతో బ్రేక్‌ ఇచ్చింది బన్నీ.. అలాగే "అల వైకుంఠపురములో" అనే చిత్రంతో ఇండస్ట్రీ హిట్‌ ఇచ్చింది బన్నీ. కానీ బన్నీ గురించి చెప్పకుండా.. నా స్థాయికి ఎన్టీఆర్‌ బెటర్‌ అన్నట్లుగా ఆమె మాట్లాడటంతో.. బన్నీ ఫ్యాన్స్‌ ఆమెపై అలక వహించారు. ఈ విషయమే హైలెట్‌ చేస్తూ.. సోషల్‌ మీడియాలో ఆమెను ట్రోల్‌ చేస్తున్నారు. మరి దీనిపైనైనా ఆమె స్పందిస్తుందో.. లేదంటే.. లైట్‌ తీసుకుంటుందో చూద్దాం.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్ నాలుగో సీజన్ విన్నర్ అతడే.. గూగుల్ చెప్పేసిందిగా..?