Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి శ్రీరెడ్డి హల్‌చల్... నడిరోడ్డుపై అర్థనగ్నంగా...(Video)

సినీ నటి శ్రీరెడ్డి చెప్పినట్టే చేసింది. శనివారం ఉదయం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌చాంబర్ దగ్గర హల్ చల్ చేసింది. ఫిల్మ్ చాంబర్‌కు ఎదురుగా నడిరోడ్డుపై కూర్చొని అర్థనగ్నంగా కూర్చొని తన నిరసనను తెలిపింది. దీంతో

Webdunia
శనివారం, 7 ఏప్రియల్ 2018 (16:35 IST)
సినీ నటి శ్రీరెడ్డి చెప్పినట్టే చేసింది. శనివారం ఉదయం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌చాంబర్ దగ్గర హల్ చల్ చేసింది. ఫిల్మ్ చాంబర్‌కు ఎదురుగా నడిరోడ్డుపై కూర్చొని అర్థనగ్నంగా కూర్చొని తన నిరసనను తెలిపింది. దీంతో అటు స్థానికులతో పాటు.. ఇపుటు పోలీసులు కూడా బిత్తరపోయారు. 
 
నిజానికి గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలోని 'క్యాస్టింగ్ కౌచ్' గురించి ఘాటుగా సంచలనమైన లీకులు ఇస్తూ సోషల్ మీడియా, టీవీ డిబెట్స్‌‌లలో నానా హంగామా చేస్తూ వస్తోంది. తాజాగా ఆమె అర్థనగ్నంగా నిరసన తెలిపింది. అంతేనా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో సభ్యత్వంతో పాటు టాలీవుడ్‌లో నిర్మితమయ్యే సినిమాల్లో తెలుగు అమ్మాయిలకు 70 శాతం అవకాశం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తోంది. 
 
నిజానికి ఆమె శుక్రవారమే సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు కూడా. సీఎం కేసీఆర్‌గారూ మీరు స్పందించకపోతే.. నడిరోడ్డుపై నగ్నంగా నిలబడుతానని ప్రకటించారు. అలా ప్రకటించినట్టుగానే ఆమె శనివారం చేశారు. 
 
ఈ సందర్భంగా శ్రీరెడ్డి మాట్లాడుతూ, 'కేసీఆర్‌గారూ, మీరు మా బాధను అర్థం చేసుకోకపోతే... నిరాహారదీక్ష చేస్తా. గతంలో మీరు పోరాడి, విజయం సాధించిన మార్గాన్నే నేను ఎంచుకున్నా. మీరు ఇప్పటికీ స్పందించకపోతే, పబ్లిక్‌లో నగ్నంగా నిలబడి నిరసన తెలుపుతా. దయచేసి మేల్కోండి సార్. మిమ్మల్ని ఎలా కలవాలో కూడా నాకు తెలియడం లేదు' అని కోరింది. వీడియో చూడండి...

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం