Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీరెడ్డి క్షమాపణలు చెప్పకపోతే.. వదిలిపెట్టే ప్రసక్తే లేదు: శేఖర్ కమ్ముల

టాలీవుడ్‌లో శ్రీరెడ్డి లీక్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. నిన్నటి నిన్న హ్యాపీడేస్ దర్శకుడు శేఖర్ కమ్ములపై శ్రీరెడ్డి విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. పెద్ద డైరెక్టర్ పొగరని.. తెలుగమ్మాయిలంటే పక్కలోక

Advertiesment
శ్రీరెడ్డి క్షమాపణలు చెప్పకపోతే.. వదిలిపెట్టే ప్రసక్తే లేదు: శేఖర్ కమ్ముల
, మంగళవారం, 3 ఏప్రియల్ 2018 (17:00 IST)
టాలీవుడ్‌లో శ్రీరెడ్డి లీక్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. నిన్నటి నిన్న హ్యాపీడేస్ దర్శకుడు శేఖర్ కమ్ములపై శ్రీరెడ్డి విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. పెద్ద డైరెక్టర్ పొగరని.. తెలుగమ్మాయిలంటే పక్కలోకి తప్ప ఎందుకూ పనికిరారని నమ్మే వ్యక్తి.. బక్కపీచు సోగ్గాడు. ఊదితే ఎగిరిపోయే కొమ్ములు వచ్చిన శేఖర్ అంటూ శేఖర్ కమ్ములను పరోక్షంగా శ్రీరెడ్డి ఏకిపారేసింది. 
 
ఈ కామెంట్స్‌పై శేఖర్ కమ్ముల సీరియస్ అయ్యారు. స్త్రీల సమానత్వం, సాధికారతలను తాను ఎంతగా నమ్ముతానో తన సినిమాలు, తన కార్యక్రమాలు చూస్తే అర్థమవుతుందని శేఖర్ కమ్ముల గుర్తు చేశారు. అంతేగాకుండా శ్రీరెడ్డి చేసిన ఆరోపణలను శేఖర్ కమ్ముల ఫేస్‌బుక్ ద్వారా ఖండించారు. తనను కించపరుస్తూ.. శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలన్నీ అసత్యాలని.. శ్రీరెడ్డి పోస్టు తనకు తన కుటుంబానికి, తనను గౌరవించేవారికి చాలా మనస్తాపాన్ని కలిగించిందని శేఖర్‌కమ్ముల మండిపడ్డారు. 
 
తానెప్పుడు కలవని, చూడని, కనీసం ఫోనులో కూడా మాట్లాడని అమ్మాయి తన గురించి ఆధారాలు లేని ఆరోపణలు చేయడం షాకింగ్‌గా వుంది. ఈ దిగజారుడు చర్య వెనుక ఎవరున్నా.. వారి ఉద్దేశం ఏమైనా.. ఇది అనైతికం అన్నారు. తనకు వ్యక్తిత్వం, విలువలు తన ప్రాణం కంటే ముఖ్యమన్నారు. వాటి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. తన పోస్టులపై క్షమాపణ చెప్పకపోతే.. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని  శేఖర్ కమ్ముల అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"సైరా"లో అమితాబ్ భారతంలో భీష్ముడేనా...? (Video)