Webdunia - Bharat's app for daily news and videos

Install App

#BlackBuckPoachingCase : సల్మాన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు

కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు జోధ్‌పూర్ మేజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కృష్ణ జింకలను చంపిన కేసులో ఆయనకు ఐదేళ్ళ జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధించిన సంగతి తెలిసింద

Webdunia
శనివారం, 7 ఏప్రియల్ 2018 (15:54 IST)
కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు జోధ్‌పూర్ మేజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కృష్ణ జింకలను చంపిన కేసులో ఆయనకు ఐదేళ్ళ జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలంటా ఆయన తరపు న్యాయవాదులు సమర్పించిన బెయిల్ పత్రాలపై విచారణ జరిపిన మేజిస్ట్రేట్... రూ.50 వేల సొంత పూచీకత్తుపై బెయిలు మంజూరు చేసింది. దీంతో ఆయన శనివారమే తిరిగి ఇంటికి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, ఈ కేసులో సల్మాన్ ఖాన్ రెండు రోజులు జైల్లో గడిపిన విషయం తెల్సిందే. 
 
ఇదిలావుంటే, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఉన్న సైఫ్ అలీ ఖాన్‌, ట‌బు, సొనాలీ బింద్రే, నీల‌మ్‌ల‌ను కోర్టు నిర్దోషులుగా ప్ర‌క‌టించింది. నిజానికి ఓ సినిమా షూటింగ్ నిమిత్తం రాజస్థాన్‌కు వెళ్లారు. అక్కడ నుంచి స‌ల్మాన్‌తోపాటు ఆ రోజు వేట‌కు ఈ నలుగురూ కూడా వెళ్లారు. వీరి ప్రోద్భ‌లంతోనే స‌ల్మాన్ వేటాడాడు అని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. 
 
అయినా కోర్టు వీరిని నిర్దోషులుగా ప్ర‌క‌టించ‌డానికి కార‌ణం సాక్ష్యాలు లేక‌పోవ‌డ‌మే. ఈ కేసులో ప్ర‌త్య‌క్ష సాక్షి అయిన పూన‌మ్ బిష్ణోయ్‌.. ఆ రోజు జీపులో స‌ల్మాన్‌తోపాటు ఉన్న‌ది వీరేనా అనేది ఖచ్చితంగా చెప్ప‌లేక‌పోయారు. ఘ‌ట‌న జ‌రిగిన రోజున అంద‌రూ తెల్ల రంగు బ‌ట్ట‌లు ధ‌రించార‌ని, అందువ‌ల్ల‌నే వారిని ఖచ్చితంగా గుర్తించ లేక‌పోతున్నాన‌ని బిష్ణోయ్ కోర్టుకు వెల్ల‌డించారు. దీంతో మిగిలిన న‌లుగురూ శిక్ష నుంచి త‌ప్పించుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vijayawada: విజయవాడలో బాంబు కలకలం: అజ్ఞాత వ్యక్తి ఫోన్.. చివరికి?

Vallabhaneni Vamsi: పోలీసుల కస్టడీలో తీవ్ర అస్వస్థతకు గురైన వల్లభనేని వంశీ

లుకౌట్ నోటీసు దెబ్బకు కలుగులోని ఎలుక బయటకు వచ్చింది.. (Video)

గువ్వల చెరువు ఘాట్‌ రోడ్డు మలుపు వద్ద ఘోరం ... ఐదుగురు స్పాట్ డెడ్

వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం.. నిందితులంతా సహచరులే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments