Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హల్లో కేసీఆర్... నేను పబ్లిక్‌లో నగ్నంగా నిలబడతా...

ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ములపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తలకెక్కిన హీరోయిన్ శ్రీరెడ్డి. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులపై ఈమె చేసిన అనుచిత వ్యాఖ్యలకుగాను ఈమెపై చర్య తీసుకోవాలంటూ పలువురు సిన

Advertiesment
హల్లో కేసీఆర్... నేను పబ్లిక్‌లో నగ్నంగా నిలబడతా...
, శుక్రవారం, 6 ఏప్రియల్ 2018 (12:10 IST)
ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ములపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తలకెక్కిన హీరోయిన్ శ్రీరెడ్డి. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులపై ఈమె చేసిన అనుచిత వ్యాఖ్యలకుగాను ఈమెపై చర్య తీసుకోవాలంటూ పలువురు సినీ ప్రముఖులు ఫిర్యాదులు కూడా చేశారు. దీంతో బెంబేలెత్తిపోయిన ఆమె ఇపుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఓ విజ్ఞప్తి చేసింది. తన ఫేస్‌బుక్ ఖాతాలో ఆమె ఓ పోస్ట్ చేసింది. 
 
ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియా ద్వారా సీఎంకు తన బాధను వ్యక్తపరిచింది. 'కేసీఆర్ గారూ, మీరు మా బాధను అర్థం చేసుకోకపోతే... నిరాహారదీక్ష చేస్తా. గతంలో మీరు పోరాడి, విజయం సాధించిన మార్గాన్నే నేను ఎంచుకున్నా. మీరు ఇప్పటికీ స్పందించకపోతే, పబ్లిక్‌లో నగ్నంగా నిలబడి నిరసన తెలుపుతా. దయచేసి మేల్కోండి సార్. మిమ్మల్ని ఎలా కలవాలో కూడా నాకు తెలియడం లేదు' అంటూ పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2వేల థియేటర్లలో ప్రీమియర్ షోస్.. భరత్ అనే నేను ప్రీ రిలీజ్‌కు ఎన్టీఆర్ మాత్రమే?