Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫిలిమ్ నగర్ నడిరోడ్డుపై బట్టలూడదీసి నిలబడతా - శ్రీరెడ్డి: చేయిచేసుకున్న కళ్యాణి

శ్రీరెడ్డి లీక్స్ ప్రస్తుతం టాలీవుడ్ షేక్ చేస్తోంది. ఆధారాలు లేకుండా ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ములపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపాయి. ఇప్పటికే శేఖర్ కమ్ముల శ్రీరెడ్డికి లీగల్ నోటీసులు ఇచ్చారని

Advertiesment
Karate kalyani
, గురువారం, 5 ఏప్రియల్ 2018 (14:57 IST)
శ్రీరెడ్డి లీక్స్ ప్రస్తుతం టాలీవుడ్ షేక్ చేస్తోంది. ఆధారాలు లేకుండా ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ములపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపాయి. ఇప్పటికే శేఖర్ కమ్ముల శ్రీరెడ్డికి లీగల్ నోటీసులు ఇచ్చారని ఓ చర్చా కార్యక్రమంలో శ్రీరెడ్డి తెలిపింది. అలాగే తెలుగు సినీ ఇండస్ట్రీ గురించి శ్రీరెడ్డి చేస్తున్న తీవ్ర వ్యాఖ్యలపై తెలుగు కామెడీ నటీమణి కళ్యాణి మండిపడ్డారు. 
 
తెలుగు సినీ ఇండస్ట్రీలో వున్న వేధింపులు గురించి శ్రీరెడ్డి బయటపెట్టిన సంగతి మంచిదేనని.. కానీ ఆమె మాట్లాడటం అభ్యంతరకరంగా వుందని కళ్యాణి అభిప్రాయపడ్డారు. కళ్యాణి వ్యాఖ్యలకు స్పందించిన శ్రీరెడ్డి.. తన బాధను ఎవరూ అర్థం చేసుకోలేదని.. ఇంత జరుగుతుందని చెప్తున్నా.. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని.. దర్శకనిర్మాతలు నోరెత్త లేదని.. ప్రముఖ దర్శకుడు తేజ మాత్రమే ముందుకొచ్చి ఈ వాదనపై మాట్లాడరని శ్రీరెడ్డి చెప్పారు.
 
ఇంత జరుగుతుందని.. తెలుగమ్మాయిలు అష్టకష్టాలు పడుతున్నారని చెప్తున్నా పట్టించుకోకుండా వున్నారని.. తనకు న్యాయం జరగకపోతే.. ఫిలిమ్ నగర్ నడి రోడ్డుపై బట్టలూడదీసి నిలుస్తానని శ్రీరెడ్డి చెప్పింది. దీంతో కోపంతో ఊగిపోయిన కళ్యాణి.. ఇలాంటి మాటలు మాట్లాడొద్దని.. మహిళలను కించపరిచేలా శ్రీరెడ్డి వ్యాఖ్యానిస్తుందంటూ.. ఆవేశానికి లోనైంది. 
 
అంతటితో ఆగకుండా చర్చ కార్యక్రమంలోనే శ్రీరెడ్డిపై చేయిచేసుకుంది. ఇంతటి దారుణమైన నిర్ణయాలు తీసుకోవద్దంటూ శ్రీరెడ్డిని హెచ్చరించింది. శ్రీరెడ్డి పిచ్చిపిల్లని.. ఆమె పడిన బాధలను చెప్తున్నా ఎవ్వరూ పట్టించుకోవట్లేదని కరాటే కళ్యాణి చెప్పింది. ఈ విషయాన్ని పెద్దలు పట్టించుకోవాలని.. ఒత్తిడిలో శ్రీరెడ్డి మాట్లాడుతోందని.. కరాటే కళ్యాణి వెల్లడించింది. శ్రీరెడ్డికి తాను పూర్తిగా మద్దతిస్తానని కరాటే కళ్యాణి తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సల్మాన్‌ను చూసి కృష్ణ జింక దానికదే చచ్చింది... ట్విట్టర్‌లో పేలుతున్న జోక్స్