Webdunia - Bharat's app for daily news and videos

Install App

అపుడు వైఎస్.. ఇపుడు జగన్ :: 'యాత్ర-2'లో హీరోగా 'మన్మథుడు'

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2020 (10:16 IST)
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా మహీ వి. రాఘవ దర్శకత్వంలో గతంలో 'యాత్ర' పేరిట బయోపిక్ మూవీ వచ్చింది. ఇది సూపర్ డూపర్ హిట్ సాధించింది. తాజాగా, వైఎస్ జగన్ సీఎం అయ్యేంతవరకూ జరిగిన సంఘటనలతో 'యాత్ర-2' స్క్రిప్ట్‌ను ఆయన సిద్ధం చేసినట్టు సమాచారం. 
 
ఇందులో జగన్ తెర జీవిత పాత్రను ప్రముఖ నటుడు నాగార్జున పోషించనున్నాడని సమాచారం. మహీ వి రాఘవ చెప్పిన స్క్రిప్ట్‌పై నమ్మకంతో నాగ్, ఈ పాత్రను చేసేందుకు అంగీకరించినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఈ విషయంలో అధికారిక స్పందన వెలువడాల్సి వుంది. ఈ వార్తే నిజమై, నాగార్జున, తెరపై జగన్ పాత్రను పోషిస్తే, సినిమాపై భారీ అంచనాలు ఏర్పడటం ఖాయం.
 
నిజానికి మహి వి రాఘవ దర్శకుడిగా ఇప్పటివరకు తీసిన చిత్రాలు 3. 'పాఠశాల', 'ఆనందోబ్రహ్మ', 'యాత్ర'. ఈ మూడు చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపునే పొందాడు. 'ఆనందో బ్రహ్మ' మంచి సక్సెస్‌ సాధించగా.. 'యాత్ర' చిత్రం అతనికి మంచి పేరును తీసుకువచ్చింది. వైఎస్‌ఆర్‌ జీవిత కథతో మమ్ముట్టి ప్రధాన పాత్రలో ఈ చిత్రం తెరకెక్కింది. 
 
ఇక ఆ చిత్రం తర్వాత మహి వి రాఘవ ఇప్పటివరకు మరో చిత్రం చేయలేదు. వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యే వరకు సాగిన జీవిత కథతో 'యాత్ర 2' స్క్రిప్ట్ సిద్ధం చేసినట్టు సమాచారం. ప్రస్తుతం 'యాత్ర 2' స్క్రిప్ట్ రెడీ అయినట్లుగా, అందులో నాగార్జున.. వైఎస్ జగన్‌ పాత్రను చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments