Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రన్నరప్ శ్రీముఖి గురించి కొన్ని విషయాలు (video)

రన్నరప్ శ్రీముఖి గురించి కొన్ని విషయాలు (video)
, సోమవారం, 4 నవంబరు 2019 (12:27 IST)
బిగ్ బాస్ మూడో సీజన్‌ రన్నరప్‌గా నిలిచిన శ్రీముఖిపై మొదటి నుంచే విన్నరనే ప్రచారం జరిగింది. బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్ర‌వేశించిన నాటి నుంచే శ్రీ‌ముఖి త‌న దూకుడు, యాంక‌రింగ్‌లో ఉన్న అనుభ‌వంతో మాట‌ల‌తోనే అంద‌రిని క‌ట్టి పడేసింది. తన‌కు ఏ టాస్క్ ఇచ్చినా వాటిని అంతే స‌మ‌ర్థ‌వంతంగా పూర్తి చేసి అంద‌రి చేత శ‌భాష్ అనిపించుకునేంది.

అయితే ఒక్కొక్క‌సారి శ్రీ‌ముఖి వ్య‌వ‌హార‌శైలీ అతిగా ఉండ‌టం, బిగ్‌బాస్‌నే డామినేట్ చేసేలా ఉంద‌ని హోస్ట్ నాగార్జున చేత చివాట్లు తిన్నారు. ఒక సంద‌ర్భంలో ఎలిమినేష‌న్‌లోకి వెళ్ళింది. కానీ ప్రేక్ష‌కులు శ్రీ‌ముఖికి అండ‌గా ఉండ‌టంతో బ‌తికిపోయింది.
 
శ్రీ‌ముఖి చేసిన త‌న త‌ప్పిదాల‌ను క్ర‌మ‌క్ర‌మంగా త‌గ్గించుకుని బిగ్‌బాస్ 3 టైటిల్ రేస్‌లోకి వ‌చ్చి అంద‌రికి జోష్‌ను నింపారు. గ‌త రెండు బిగ్‌బాస్ సీజ‌న్ల‌లో విన్న‌ర్లుగా పురుషులే నిల‌వ‌డంతో ఈసారి మ‌హిళ‌ల‌ను విజేత‌గా చేయాల‌ని అనేక డిబేట్లు కూడా జరిగాయి. కానీ గ్రాండ్ ఫినాలేలో రాహులే గెలిచాడు. రాహుల్ క్ర‌మ‌క్ర‌మంగా బ‌ల‌ప‌డి శ్రీముఖిని వెనక్కి నెట్టేశాడు. చివ‌ర‌కు బిగ్‌బాస్ 3 విజేత‌గా రాహుల్ నిల‌వ‌డంతో ర‌న్న‌ర‌ర్‌గా నిలిచింది శ్రీ‌ముఖి.
 
ఇక శ్రీముఖి గురించి కొన్ని విషయాలు 
బిగ్‌బాస్ 3 ర‌న్న‌ర‌ర్‌గా నిలిచిన శ్రీ‌ముఖి 1993 మే 10న నిజమాబాద్‌కు చెందిన రామ‌కృష్ణ, ల‌త దంప‌తుల‌కు జ‌న్మించింది. తెలుగులో అదుర్స్ టీవీ రియాల్టీ షోతో త‌న యాంక‌రింగ్ కెరీర్‌ను ప్రారంభించింది. త‌న మాట‌ల మాయ‌తో అన‌తి కాలంలోనే టాప్ యాంక‌ర్‌గా పేరు సంపాదించిన శ్రీ‌ముఖీకి సినిమాల్లోనూ అవ‌కాశం వ‌చ్చింది. 2012లో స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ న‌టించిన జులాయ్ సినిమాలో హీరోకు చెల్లెగా న‌టించింది. ఇక త‌న న‌ట‌న ప్ర‌తిభ‌తో వ‌రుస‌గా సినిమాల్లో అవ‌కాశాలు సంపాదించి తెలుగు, త‌మిళం, క‌న్న‌డ సినిమాల్లో న‌టించింది.
 
ఈ క్రమంలో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌, ప్రేమ ఇష్క్ కాద‌ల్‌, ఎట్టుతిక్కుం మ‌దయానాయ్ (త‌మిళం), చంద్రిక‌, ధ‌న‌ల‌క్ష్మి త‌లుపు త‌డితే, ఆంధ్రాపోరీ, నేను శైల‌జ‌, సావిత్రి, జెంటిల్‌మెన్‌, మ‌న‌లో ఒక్క‌డు, బాబూ బాగా బిజీ అనే సినిమాల్లో న‌టించింది. టీవీలో అదుర్స్ 1, 2, మ‌నీ మ‌నీ, సూపర్ సింగ‌ర్ 9, భ‌లే ఛాన్స్‌లే, సూప‌ర్ మామ్‌, సూప‌ర్ సీరియ‌ల్ ఛాంపియ‌న్ షిప్‌, ప‌టాస్‌, జీ స‌రిగ‌మ‌ప షోల‌కు యాంక‌ర్‌గా ప‌నిచేసింది శ్రీ‌ముఖి. త‌న న‌ట‌న‌, యాంక‌రింగ్‌తో బిగ్‌బాస్ 3 కి ఎంపిక అయింది. అయినా రన్నరప్‌గానే మిగిలిపోయింది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రంగస్థలం సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. గెలుపుకు సీఎం జగన్ ఫ్యాన్స్ కారణమా? (video)