Webdunia - Bharat's app for daily news and videos

Install App

రియా నోటి వెంట ఎవరి పేర్లూ రాలేదు : ఎన్.సి.బి

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2020 (09:53 IST)
డ్రగ్స్ వ్యవహారంలో పలువురు బాలీవుడ్ సెలెబ్రిటీల పేర్లను నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి వెల్లడించినట్టు వచ్చిన వార్తలను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కొట్టిపారేసింది. ఇదే అంశంపై ఎన్.సి.బి డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా స్పందిస్తూ, ఎన్.సి.బి జరుపుతున్న విచారణలో రియా చక్రవర్తి ఎవరి పేర్లనూ చెప్పలేదని తెలిపారు.
 
తమ వద్ద నిందితులు, బాధితుల జాబితా ఏమీ లేదంటూ ఎన్సీబీ కీలక ప్రకటన చేసింది. దాదాపు 25 మంది పేర్లను ఎన్సీబీ అధికారుల ముందు రియా చెప్పిందని, వారందరికీ వరుసగా నోటీసులను జారీ చేసి, విచారిస్తారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలు బాలీవుడ్‌లో కలకలం రేపాయి. ఈ డ్రగ్స్ దందాలో ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉందని వార్తలు వచ్చాయి. 
 
ఈ నేపథ్యంలో తాజాగా ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా ఓ ప్రకటన విడుదల చేశారు. రియా నోటి నుంచి ఎవరి పేర్లూ రాలేదని స్పష్టంచేశారు. తాము కేవలం డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారి జాబితానే తయారు చేశామని, దాన్నే సినీ పరిశ్రమ జాబితాగా పొరపడ్డారేమోనని అన్నారు. సినీ పరిశ్రమపై జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రమూ నిజం లేదని ఈ ప్రకటనలో కేపీఎస్ మల్హోత్రా పేర్కొనడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru: విద్యార్థులకు మెట్రో పాస్‌లు, ఫీడర్ బస్సులు ఇవ్వాలి.. ఎక్కడ?

Chandrababu: ముగిసిన చంద్రబాబు సింగపూర్ పర్యటన- అమరావతికి తిరుగుముఖం

లడఖ్‌లోని గల్వాన్‌లో సైనిక వాహనంపై పడిన బండరాయి: ఇద్దరు మృతి

ప్రకాశం బ్యారేజీకి 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు.. అలెర్ట్

విద్యార్థికి అర్థనగ్న వీడియో కాల్స్... టీచరమ్మకు సంకెళ్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments