Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ సన్నివేశాల్లో నటించడం నా వల్ల కాదు.. తమన్నా

Webdunia
గురువారం, 25 ఏప్రియల్ 2019 (19:36 IST)
మిల్కీ బ్యూటీ తమన్నాకు తెలుగు సినీపరిశ్రమలో ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. వరుసగా సినిమాలు చేతిలో లేకున్నా కథ నచ్చితేనే మంచి సినిమాలకు ఒప్పుకుంటోంది. ఆచితూచి సినిమాలను చేస్తోంది తమన్నా. తాజాగా సైరా సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా తెలుగు సినీపరిశ్రమలో ఒక చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమాలో ఎంతోమంది ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు.
 
అయితే తమన్నా కూడా ఒక ముఖ్య పాత్రను ఇందులో పోషిస్తున్నారట. అయితే ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు తన స్నేహితులు షూటింగ్ స్పాట్ లోకి వచ్చినప్పుడు తమన్నా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారట. నేను సినిమాల్లో మంచి పాత్రలోనే నటించాలనుకుంటాను. థియేటర్‌లో కూర్చున్నప్పటి నుంచి శుభం కార్డు పడి వెనుతిరిగి వెళ్లేంత వరకు నవ్విస్తూనే ఉండే క్యారెక్టర్ నేను చేయాలనుకుంటాను. 
 
అలాంటి పాత్రే ఎఫ్..2. నేను నటించిన ఆ సినిమా ప్రతి పాత్ర నవ్వు తెప్పిస్తుంది. అందుకే అలాంటి సినిమాలనే ఎక్కువగా చేయాలనుకుంటాను. అంతేతప్ప సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ఏడుపు సీన్లు నటించడమన్నా.. అభిమానులను ఏడిపించడమన్నా నాకు అస్సలు ఇష్టం ఉండదు అంటోంది తమన్నా. నాకు నవ్వించే క్యారెక్టర్లంటేనే ఇష్టం. ఏడుపుగొట్టు క్యారెక్టర్లను ఇవ్వొద్దని డైరెక్టర్లకు మిల్కీ బ్యూటీ చెబుతోందట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మౌని అమావాస్య- ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో తొక్కిసలాట.. 15మంది మృతి

డాక్టరైనా నాకీ గతి పడుతుందని అనుకోలేదు మమ్మీ: లేడీ డాక్టర్ ఆత్మహత్య యత్నం (Video)

మెగాస్టార్ మెచ్చిన ఎకో రిక్రియేషనల్ పార్క్, మన హైదరాబాదులో...

మీర్‌పేట హత్య : పోలీసులం సరిగా వివరించలేకపోవచ్చు కానీ, జర్నలిస్టులు సరిగ్గా వివరించగలరు..

అవార్డుల కోసం గద్దర్ పనిచేయలేదు : కుమార్తె వెన్నెల (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలం సీజనల్ వ్యాధులను అడ్డుకునే ఆహారం ఏమిటి?

లవంగం పాలు తాగితే ఈ సమస్యలన్నీ పరార్

బెల్లం వర్సెస్ పంచదార, ఏది బెస్ట్?

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

తర్వాతి కథనం
Show comments