Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా రూటే సెపరేటు అంటున్న పాయల్ రాజ్‌పుత్... అంతేగా!!

Advertiesment
నా రూటే సెపరేటు అంటున్న పాయల్ రాజ్‌పుత్... అంతేగా!!
, శనివారం, 20 ఏప్రియల్ 2019 (17:25 IST)
హీరోయిన్లకు కెరీర్ విషయంలో బోలెడన్ని క్యాలుక్యులేషన్స్ ఉంటాయి. కెరీర్ స్టార్టింగ్‌లో ఎలా ఉండాలి. క్లైమాక్స్ చేరినప్పుడు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అని చాలా థియరీస్ ఉంటాయి. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలామంది హీరోయిన్లు ఆ థియరీతోనే కెరీర్‌ను రన్ చేస్తూ ఉంటారు. కానీ పాయల్ రాజ్‌పుత్ మాత్రం క్యాలిక్యులేషన్స్‌తో సంబంధం లేదని సినిమాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
 
యంగ్ స్టార్స్‌తో కలిసి నటిస్తున్న సమయంలో హీరోయిన్లు ఎవరూ సీనియర్ హీరోలతో చేయడానికి పెద్దగా ఇష్టపడరు. సీనియర్ హీరోలతో కలిసి నటిస్తే స్టార్ హీరోల నుంచి అవకాశాలు రావని భయపడుతుంటారు. కాజల్ అగర్వాల్ లాంటి హీరోయిన్లు కూడా కెరీర్ క్లైమాక్స్‌కు చేరుతుంది అనుకుంటున్న టైంలోనే సీనియర్ స్టార్ చిరంజీవితో కలిసి నటించింది. మిల్కీ బ్యూటీ తమన్నా స్టార్ హీరోల నుంచి అవకాశాలు తగ్గుతున్న టైంలోనే సీనియర్ హీరో వెంకటేష్‌తో కలిసి నటించింది. 
webdunia
 
పాయల్ రాజ్‌పుత్ మాత్రం ఇలాంటివేమీ పట్టించుకోకుండా సినిమాలకు సైన్ చేస్తోంది. ఆర్.ఎక్స్.100 సినిమాతో తానేంటో నిరూపించుకుని టాలీవుడ్‌కు చిన్నపాటి గ్లామర్ ట్రీట్మెంట్ ఇచ్చిన ఈ బ్యూటీ సీనియర్లు, జూనియర్లు, ఐటెం సాంగ్స్ అని తేడా లేకుండా అన్ని రకాల సినిమాలు చేసేస్తోంది. ఆర్.ఎక్స్.100 సినిమా తరువాత వెంకటేష్‌తో జోడీ కట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. తెలుగు, తమిళ సినిమాల్లో కలిపి మొత్తం 4,5 సినిమాల్లో నటిస్తోంది పాయల్ రాజ్‌పుత్. 
 
ప్యూచర్ స్టార్ హీరోయిన్ అని పాయల్ రాజ్‌పుత్‌కు పేరు వచ్చేసింది. మరి ఇలాంటి టైంలో సీనియర్లు, ఐటెం సాంగ్స్ అని వెళితే పాయల కెరీర్ ఎటు వెళుతుందో అని ఆమె ఫ్యాన్స్ భయపడుతున్నారు. పాయల్ రాజ్‌పుత్ మాత్రం ఇలాంటి క్యాలుక్యులేషన్స్‌తో సంబంధం లేకుండా తమ దగ్గరకు వచ్చిన బెస్ట్ ప్రాజెక్టులకు కమిట్ అవుతోంది. నచ్చిన కథలతో కెరీర్‌ను మెమొరబుల్‌గా మలుచుకోవాలనుకుంటోంది. మరి సినిమాటిక్ పట్టింపులు లేకుండా ముందుకు వెళుతున్న పాయల్ కెరీర్ ఎలా టర్నింగ్స్ తీసుకుంటుందో చూడాలి. అంతేగా...!! 
webdunia

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కూర్చీల్లో కూర్చుంటే ఏం కనిపెట్టలేం..?